కోలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్య సమస్యలతో ప్రముఖ నటుడు కణ్ణన్(48) కన్నుమూశారు. ఈ విషయాన్ని తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు కణ్ణన్. ఈ క్రమంలోనే వారం కిందట ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు.
సింగపూర్‌లోని వసంతం టీవీలో వీజేగా కెరీర్ ప్రారంభించిన కణ్ణన్.. ఆ తర్వాత చెన్నైలో స్థిరపడ్డారు. పలు సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. 2012లో 'అతిశయ ఉలగం' సినిమాతో వెండితెర అరంగేట్రం చేశారు. అనంతరం పలు షోల్లోనూ మెరిశారు. ఉత్తమ నటుడిగా అవార్డులనూ అందుకున్నారు.
ఇదీ చూడండి: క్రిష్-వైష్ణవ్ చిత్రం విడుదల తేదీ ఖరారు!