పదిహేనేళ్ల సినీ ప్రయాణాన్ని చూసిన అతికొద్ది మంది కథానాయికల్లో తమన్నా ఒకరు. ఇప్పటికీ అగ్ర హీరోలతో నటిస్తూ వరుస అవకాశాలతో యువ హీరోయిన్లకు పోటీగా నిలుస్తోంది. 'మరి ఈ సినీ ప్రయాణంలో మీకు సాయం చేసిన కథానాయికలు ఎవరైనా ఉన్నారా?' అని తమన్నాను ప్రశ్నిస్తే ఆసక్తికర సమాధానమిచ్చింది.
"అందరూ హీరోయిన్ల మధ్య పోటీ వాతావరణమే ఉందనుకుంటారు కానీ, మా మధ్య గొప్ప స్నేహాలు ఉన్నాయి. అందరూ తెర ముందు విషయాలే మాట్లాడతారు కానీ.. తెర వెనక మేం ఏంటి అన్నది చూడరు. అవసరం వచ్చినప్పుడు ఒకరికొకరం సాయం చేసుకుంటాం. నేను సినీ కెరీర్ ఆరంభించిన కొత్తలో అనుష్క నాకు సాయం చేసింది. అప్పుడు నాకు కాస్ట్యూమ్ డిజైనర్ కూడా లేరు. అనుష్కనే కాస్ట్యూమ్స్ విషయంలో సాయపడింది. నాకెలాంటి అవసరం వచ్చినా.. తనకు ఫోన్ చేయగానే స్పందిస్తుంది. కాజల్, సమంత నాకు మంచి స్నేహితులు" అని తమన్నా చెప్పింది.