'మా' ఎన్నికల్లో (MAA Elections 2021) గెలిచిన సభ్యులకు అభినందనలు తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav News). 'మా' ఒక కుటుంబం కాదు.. పెద్ద వ్యవస్థ అని అన్నారు. మా అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణు ప్రమాణ స్వీకారోత్సవానికి నటుడు మోహన్‌బాబుతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ఆయన.. మంచి వ్యక్తులు ఎన్నికయ్యారని కొనియాడారు.
"మోహన్‌బాబు.. విష్ణుకు క్రమశిక్షణ నేర్పించారు. విష్ణుకు సంస్కారంతో పాటు గౌరవించడం నేర్పించారు. సమాజహితం కోసమే మోహన్‌బాబు మాట్లాడతారు. మోహన్‌బాబు (Mohan Babu News) ఎప్పుడూ వ్యక్తిగత లాభం కోసం మాట్లాడలేదు. వెంకటేశ్వరస్వామి సన్నిధిలో విద్యాసంస్థను నడుపుతున్నారు. మంచి వ్యక్తులను 'మా' సభ్యులుగా ఎన్నుకోవడం సంతోషకరం."
- తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి
రామోజీ ఫిలింసిటీ గర్వకారణం..
హైదరాబాద్ సినీ హబ్‌గా ఉండాలని కేసీఆర్ సంకల్పించినట్లు తలసాని తెలిపారు. సింగిల్ విండో ద్వారా అన్ని రకాల అనుమతులు ఇస్తున్నట్లు చెప్పారు. "తెలంగాణలో అద్భుతమైన కళాఖండాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. తెలంగాణలో షూటింగ్‌లకు అనువైన వాతావరణం ఉంది. రామోజీ ఫిలింసిటీ (Ramoji Film City News) హైదరాబాద్‌లో ఉండటం గర్వకారణం. . ప్రపంచంలోనే అద్భుతమైన ఈ కళాఖండాన్ని రామోజీరావు ఇక్కడ సృష్టించారు. థియేటర్లలోనే సినిమాలు చూడాలని ప్రేక్షకులను కోరుతున్నా. సినీ ప్రముఖులు ఐక్యంగా ఉంటే 'మా'లో (MAA Elections 2021) సమస్యలే ఉండవు" అని తలసాని అన్నారు.
ఇదీ చూడండి: Maa elections 2021: 'మా' అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం