ETV Bharat / sitara

సూర్య నిర్ణయంపై అభిమానుల అసంతృప్తి! - 2020 సినిమా వార్తలు

తమిళ స్టార్​ సూర్య హీరోగా వస్తోన్న 'సూరారై పోట్రు' చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే, ఈ నిర్ణయంపై సూర్య ఫ్యాన్స్​ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యమైనా థియేటర్లలోనే రిలీజ్ చేయాలంటూ కోరుతున్నారు.

Suriya's fans
సూర్య
author img

By

Published : Aug 24, 2020, 12:30 PM IST

Updated : Aug 24, 2020, 12:40 PM IST

కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​తో దేశవ్యాప్తంగా థియేటర్లన్నీ మూతపడ్డాయి. ఫలితంగా సినిమాలన్నీ ఓటీటీ వైపు అడుగులేస్తున్నాయి. ఇటీవలే సూర్య హీరోగా తెరకెక్కిన 'సూరారై పోట్రు'ను నేరుగా డిజిటల్​ ప్లాట్​ఫామ్​లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ విషయంపై సూర్య అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇంత పెద్ద సినిమాను ఆన్​లైన్​లో విడుదల చేయాలన్న నటుడి నిర్ణయాన్ని ప్రేక్షకులు, సినీ విమర్శకులు ట్విట్టర్​ వేదికగా తప్పుబట్టారు. మరోసారి ఈ విషయంపై పునఃపరిశీలించాలని సూచించారు. ఆలస్యమైనా సినిమాను థియేటర్లలోనే చూడాలని భావిస్తున్నట్లు అభిమానులు సూర్యను ట్యాగ్​ చేస్తూ.. పోస్ట్​ చేశారు.

సుధా కొంగర ఈ చితానికి దర్శకత్వం వహించారు. ఎయిర్​ దక్కన్​ వ్యవస్థాపకుడు జి.ఆర్​ గోపీనాథ్​ జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కింది. ఏప్రిల్​ 9న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సి ఉండగా.. కరోనా కారణంగా నిలిపేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే చిత్ర నిర్మాతలతో సుదీర్ఘ చర్చల అనంతరం.. అమెజాన్​ ప్రైమ్​ వేదికగా అక్టోబరు 30న విడుదల చేస్తున్నట్లు సూర్య ప్రకటించారు.

ఈ చిత్రంలో టాలీవుడ్​ విలక్షణ నటుడు మంచు మోహన్​బాబు కీలకపాత్ర పోషించారు. సూర్య, బాలీవుడ్​ నిర్మాత గుణీత్​ మోంగ సంయుక్తంగా నిర్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్​ స్వరాలను సమకూర్చారు.

  • You are sacrificing your career best movie #sooraraipottru for technicians and their families others who is believing in you Means.
    I'm also ready to sacrifice #SooraraiPottru for you Anna. @Suriya_offl counting the days for October 30th. You are everything for me Anna.

    — Rokesh ortan (@OrtanRokesh) August 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Aug 24, 2020, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.