ETV Bharat / sitara

సూర్య కొత్త చిత్రం 'జై భీమ్'.. నవ్విస్తోన్న తేజ సజ్జా - హన్సిస మహా

టాలీవుడ్ నుంచి పలు అప్​డేట్స్ వచ్చాయి. ఇందులో సూర్య కొత్త సినిమా, హన్సిక 'మహా' సెన్సార్, సత్యదేవ్ 'తిమ్మరుసు', తేజ సజ్జా 'ఇష్క్'​ ప్రమోషనల్ వీడియోకు సంబంధించిన వార్తలు ఉన్నాయి.

suriya
సూర్య
author img

By

Published : Jul 23, 2021, 7:03 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు. నేడు (శుక్రవారం) ఆయన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాల ప్రకటనలతో పాటు ఫస్ట్​లుక్​లను విడుదల చేస్తున్నాయి చిత్రబృందాలు. తాజాగా సూర్య 39వ సినిమాగా రూపొందుతోన్న చిత్ర టైటిల్​తో పాటు ఫస్ట్​లుక్​ రిలీజ్ అయింది. 'జై భీమ్' అనే టైటిల్​తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సూర్య న్యాయవాదిగా కనిపించనున్నారు. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు.

suriya jai bheem
సూర్య జైభీమ్

'మహా'.. హన్సిక 50వ సినిమా. తమిళంలో థ్రిల్లర్‌ డ్రామా జోనర్‌లో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేయాలనుకున్నారు. అయితే దీని విడుదలకు ఆటంకాలు ఎదురయ్యాయి. గతేడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది విడుదల చేయాలనుకున్నారు. ఇంతలో కరోనా విజృంభించింది. లాక్‌డౌన్‌తో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించారు నిర్మాతలు. తాజాగా థియేటర్లు తెరుచుకోనున్న నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్​కు వెళ్లింది. బోర్డు దీనికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది.

hansika
హన్సిక 'మహా'

తేజ సజ్జా, ప్రియా వారియర్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'ఇష్క్'. థియేటర్లు మూతపడటం వల్ల ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తారంటూ వార్తలు వచ్చాయి. ప్రస్తుతం థియేటర్లు తెరుచుకునేందుకు సిద్ధం కావడం వల్ల ఈ మూవీని జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ప్రమోషనల్​ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది చిత్రబృందం. ఇందులో తేజ ఫ్రస్టేషన్ కడుపుబ్బా నవ్విస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సత్యదేవ్ హీరోగా నటించిన 'తిమ్మరుసు' జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్​ను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది చిత్రబృందం.

satyadev
సత్యదేవ్ తిమ్మరుసు
satyadev
సత్యదేవ్ తిమ్మరుసు
satyadev
సత్యదేవ్ తిమ్మరుసు

ఇవీ చూడండి: శిల్పాశెట్టి ఇంటికి పోలీసులు.. విచారణ ముమ్మరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.