ETV Bharat / sitara

'సూపర్ హీరోలు' మన దగ్గరికీ వచ్చేస్తున్నారోచ్!

సూపర్ హీరో చిత్రాలంటే ప్రేక్షకులకు అమితాసక్తి. హాలీవుడ్​లో తెరకెక్కిన ఈ సినిమాలు భారత్​లో మంచి వసూళ్లు రాబడతాయి. దీంతో ఈ చిత్రాల్ని ఇక్కడ విడుదల చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న సూపర్ హీరో చిత్రాలేంటో తెలుసుకుందాం.

author img

By

Published : Jan 20, 2021, 9:00 AM IST

Superhero movies
సూపర్ హీరో చిత్రాలు

సూపర్ హీరో.. ఎవ్వరికీ సాధ్యం కాని పనుల్ని ఇట్టే పూర్తి చేస్తాడు. విలన్లను తన శక్తిమంతమైన చేతుల్తో మట్టికరిపిస్తాడు. అప్పుడప్పుడూ మ్యాజిక్కూ చేస్తాడు. సినిమాల్లో సూపర్ పవర్ ఉన్న హీరోలకు కోట్లాది మంది అభిమానులున్నారు. భారత్​లో కొన్ని సూపర్ హీరో చిత్రాలు తెరకెక్కినా.. హాలీవుడ్​లో మాత్రం ఎక్కువగా కనిపించేవి ఇవే. అలాంటి చిత్రాలకు ఇక్కడా చాలా గిరాకీ ఉంది. దీంతో అక్కడ రూపొందిన ఇలాంటి చిత్రాల్ని ఇక్కడ కూడా విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది థియేటర్లలో సందడి చేయనున్న సూపర్ హీరో చిత్రాలేంటో తెలుసుకుందాం.

జస్టిస్ లీగ్

జస్టిస్ లీగ్ జాక్ స్నైడర్ కట్.. మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. హెచ్​బీఓ మ్యాక్స్​లో ఈ ఏడాది మార్చిలో విడుదల చేయనున్నట్లు దర్శకుడు జాక్ స్నైడర్ స్పష్టం చేశారు. 2017లో విడుదలైన ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతల నుంచి మధ్యలోనే తప్పుకున్నారు స్నైడర్. ఆ తర్వాత అవెంజర్స్ డైరెక్టర్ జాస్ వెడెన్ దీనికి దర్శకత్వం వహించారు. కానీ ఆ సినిమా ఆడియన్స్​ను మెప్పించలేకపోయింది. దీంతో స్నైడర్ వెర్షన్​ను విడుదల చేయాలంటూ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో కోరారు. దీంతో ఆ సినిమాకు కొన్ని సీన్స్ జోడించి జాక్ స్నైడర్ జస్టిస్ లీగ్ పేరుతో ఈ చిత్రాన్ని మరోసారి రూపొందించారు. ఇందులో బ్యాట్​మన్, సూపర్​మన్, వండర్ ఉమన్, ద ఫ్లాష్, ఆక్వామన్ వంటి సూపర్ హీరోలు కనువిందు చేయనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

స్పైడరమ్యాన్-3

టామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్​గా కనిపించనున్న చిత్రం స్పైడర్​మ్యాన్-3. ఈ సినిమాలో ఇంతకుముందు ఆకట్టుకున్న జేమీ ఫాక్స్ (ఎలక్ట్రో), అల్ఫ్రెడ్ మొలినా (డాక్ ఓక్), టోబే మాగ్వైర్, ఆండ్రూ గారీఫీల్డ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు వహించనున్నారని సమాచారం. ఈ సినిమా డిసెంబర్ 17న విడుదలవనుంది.

మార్బియస్

జారెడ్ లిటో ప్రధానపాత్రలో నటించిన చిత్రం మార్బియస్. ఇందులో హీరో అరుదైన రక్త సంబంధ వ్యాధితో బాధపడుతుంటాడు. ఈ వ్యాధికి చికిత్స తీసుకునే క్రమంలో ఇతడు ఓ సూపర్ హ్యూమన్​గా మారతాడు. తర్వాత జరిగిన పరిణామాలేంటి? అనేది కథాంశం. ఈ సినిమా మార్చి 19న విడుదలవనుంది.

బ్లాక్ విడో

అవెంజర్స్ ఫ్రాంచైజీలో ఏకైక మహిళా ప్రధాన పాత్ర బ్లాక్ విడో. ఈ సినిమా గతేడాదే విడుదలవాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. నటాషా రోమనోఫ్​ పాత్ర చనిపోయినప్పటికీ ఆ పాత్ర తాలూకు గతంలో జరిగిన (కెప్టెన్ అమెరికా సివిలా వార్ -2016 తర్వాత జరిగిన సంఘటనలతో) సన్నివేశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం మే 7న విడుదలయ్యే అవకాశం ఉంది.

వీనమ్: లెట్ దేర్ బీ కార్నేజ్

ఈ సీక్వెల్​తో మరోసారి ఎడ్డీ బ్రోక్ పాత్రలో మెప్పించేందుకు సిద్ధమయ్యాడు టామ్ టార్డీ. ఆండీ సెరిక్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 25న విడుదలవనుంది.

ద సూసైడ్ స్క్వాడ్

విచిత్రమైన పాత్రలు, వింత కథ, కలర్​ఫుల్ టోన్​తో ఆద్యంతం ఆకట్టుకుంటుంది సూసైడ్ స్క్వాడ్. జేమ్స్ గన్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కూడా ఈ ఏడాది ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఆగస్టు 6న విడుదలవనుంది.

ఎటర్నల్స్

ఏంజెలినా జోలీ, కిట్ హారింగ్టన్, రిచర్డ్ మ్యాడెన్, జెమ్మా చాన్, కుమైల్ నంజైనీ, లౌరెన్ రిడ్లోఫ్, బ్రియన్ టైరీ, సల్మా హాయెక్, డాన్ లీ కీలకపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ఎటర్నల్స్. చ్లో జావో దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది.

ఇవీ చూడండి: బాక్సింగ్ కథ పట్టు.. హిట్టు కొట్టు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.