ETV Bharat / sitara

డ్రగ్స్​ కేసు: నటి దీపికా పదుకొణె మేనేజర్​కు సమన్లు

మాదకద్రవ్యాల వినియోగం కేసులో బాలీవుడ్​ నటి దీపికా పదుకొణె మేనేజర్​ కరిష్మా ప్రకాశ్​కు నార్కొటిక్స్​ కంట్రోల్ బ్యూరో (ఎన్​సీబీ) సమన్లు జారీ చేసింది. ఈమెతో పాటు క్వాన్​ టాలెంట్​ మేనేజ్​మెంట్​ ఏజెన్సీ సీఈఏ ధ్రువ్​కు విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపింది.

SSR case: NCB summons Deepika Padukone's manager Karishma Prakash
డ్రగ్స్​ కేసు: నటి దీపికా పదుకొణె మేనేజర్​కు సమన్లు
author img

By

Published : Sep 22, 2020, 12:10 PM IST

Updated : Sep 22, 2020, 2:57 PM IST

బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మృతిపై జరుగుతున్న విచారణ కీలక మలుపులు తీసుకుంటోంది. డ్రగ్స్‌ కోణాన్ని దర్యాప్తు చేసేందుకు నార్కొటిక్స్ కంట్రోల్‌ బ్యూరో (ఎన్​సీబీ) రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్‌ నటీనటుల పేర్లు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణెపై ఆరోపణలు వస్తున్నాయి.

మాదక ద్రవ్యాల వినియోగం కేసులో నటి దీపికా పదుకొణె మేనేజర్​ కరిష్మాతో పాటు టాలెంట్​ మేనేజ్​మెంట్​ ఏజెన్సీ సీఈఓ ధ్రువ్​లకు ఎన్​సీబీ సమన్లు జారీ చేసింది. శ్రద్ధాకపూర్‌, సారా అలీఖాన్‌లకూ త్వరలోనే సమన్లు జారీ అవుతాయని సమాచారం.

ముంబయికి ఎలా చేరుతున్నాయి?

అసలు సినీ పరిశ్రమలోకి నిషేధిత డ్రగ్స్‌ ఎలా, ఎక్కడ నుంచి వస్తున్నాయో కనిపెట్టే పనిని ఎన్​సీబీ ముమ్మరం చేసింది. పాక్‌, పంజాబ్‌ తదితర ప్రాంతాల నుంచి దేశ ఆర్థిక రాజధానిలోకి ప్రవేశించడంపై ఆరా తీస్తోంది. డ్రగ్స్‌ కేసులో ప్రస్తావనకు వచ్చిన డి, కె అనే ఆంగ్ల అక్షరాల్లో డి అంటే దీపికా పదుకొణె అని, కె అంటే ఆమె మేనేజర్‌ కరిష్మా అని భావిస్తున్నారు. కాగా వీరిని ఈ రోజు ప్రశ్నిస్తారనే వార్తలు వెలువడుతున్నాయి.

Last Updated : Sep 22, 2020, 2:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.