మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా: నరసింహారెడ్డి.' ఈ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది చిరు కుమార్తె సుస్మిత కొణిదెల. 'రంగస్థలం'లో తన పనితనం మెచ్చి రామ్‌చరణే ఈ ఆఫర్ ఇచ్చాడని చెప్పింది. అమితాబ్, నయనతార, తమన్నాకూ తానే దుస్తులు డిజైన్ చేశాని చెప్పుకొచ్చింది సుస్మిత.
ఈ సినిమా కోసం చెన్నై నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చింది సుస్మిత. 'ఖైదీ నెంబర్ 150', 'రంగస్థలం' చిత్రాల్లో కాస్ట్యూమ్స్ డిజైన్ చేసి గుర్తింపు తెచ్చుకుంది.
అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చదవండి: టీజర్: ఆకట్టుకుంటున్న 3 మంకీస్.. కామెడీ జబర్దస్త్