భాషతో సంబంధం లేకుండా ఎక్కువ మంది వీక్షించే చిత్రాలలో జేమ్స్ బాండ్ ఒకటి. బాండ్ సాహసాలు, పోరాట సన్నివేశాలు అభిమానులను బాగా ఆకట్టుకుంటాయి. వాటితో పాటు కథానాయికలతో హీరో చేసే రొమాన్స్‌నూ ప్రేక్షకులు ఆస్వాదిస్తారు.
డేనియల్ క్రేగ్ కథానాయకుడిగా జేమ్స్ బాండ్ సిరీస్‌లో 25వ సినిమా తెరకెక్కుతోంది. ఇందులోనూ రొమాంటిక్ సన్నివేశాలకు మరింత ప్రాధాన్యమిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే మీటూ ఉద్యమం మారుమోగుతున్న నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తోందట చిత్రబృందం.
" మీటూ ఉద్యమం నేపథ్యంలో సెట్‌లో నటీమణులతో వ్యవహరించాల్సిన తీరుపై కొన్ని మార్పులు చేశాం. హీరోయిన్‌లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాలను తెరకెక్కించే సమయంలో మరింత జాగ్రత్తలు పాటిస్తున్నాం. ప్రత్యేకంగా కొందరు శిక్షకులను ఏర్పాటు చేశాం. ఆయా సన్నివేశాలు తీసే సమయంలో ఎలా వ్యవహరించాలి? వారికేమైనా ఇబ్బందికరంగా ఉందా? ఇలా మాతో చెప్పుకోలేని, విషయాలను వారి ద్వారా మాకు తెలియజేయవచ్చు. వారు డేనియల్ క్రేగ్, బాండ్ గర్ల్ అనా డీ ఆర్మ్స్‌తో ఉంటారు. వారికి పూర్తి సహకారం అందిస్తారు ".
-- బార్బరా బ్రకోలి, చిత్ర నిర్మాత
బాండ్ సినిమాను వేగంగా పూర్తి చేసేందుకు నిర్మాత బార్బరా , ఆమె బృందం నిరంతరం పనిచేస్తోంది. ప్రతినాయకుడిగా ఆస్కార్ అవార్డ్ విజేత రామి మాలెక్ కనిపించనున్నట్లు సమాచారం. ఇటీవల జమైకాలో జరిగిన షూటింగ్‌లో డేనియల్ క్రేగ్ గాయపడిన సంగతి తెలిసిందే. ఫలితంగా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. త్వరలో లండన్‌లోని ప్రతిష్టాత్మక పైన్‌వుడ్ స్టూడియోస్‌లో తదుపరి షెడ్యూల్‌ను చిత్రీకరించాల్సి ఉంది. గాయం కారణంగా ఆ చిత్రీకరణ భాగాన్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది.
ఇవీ చూడండి...'బాండ్ 25'లో నటించే తారలు వీరే...