ETV Bharat / sitara

ఇలవేల్పుల దివ్యస్తోత్రం.. మూగబోయిన తెరవేల్పుల సుమధుర కంఠం - ఎస్పీ బాలు తాజా వార్తలు

నీ పాటల ప్రవాహంలో మునిగి.. తడచి.. తరించిన కోటానుకోట్ల అభిమానులను అన్యాయం చేసి వెళ్లిపోయావా... పాటంటే నీ నోటి వెంటే అన్నట్టుగా మమేకైపోయామే.. అందరినీ ఇలా వదిలేసి వెళ్లావా...? యాభై ఏళ్లకు పైగా గానామృతాన్ని పంచుతున్న నీవు.. మృత్యుంజయుడవై రావాలని 50రోజులుగా ప్రార్థనలు చేస్తున్నామే.. మా మొర వినకుండానే నీ లోకాన్ని చేరుకున్నావా? బాలూ నీవిక లేవా? తిరిగి రావా?

sp balu special story
ఎస్పీ బాలు
author img

By

Published : Sep 25, 2020, 6:36 PM IST

పాటల పూదోటలో సప్తస్వరాలతో సయ్యాటలాడిన ఆ తోటమాలి ఇక లేడు! ఐదు దశాబ్దాలుగా, రస హృదయాలను రాగరంజితం చేసిన మహాగాయకుడు పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం పరమపదించారు. సుస్వరాలతో సర్వేశ్వరుణ్ని అర్చించిన 'శంకరాభరణం' ఆయన! తెలుగునాట పుట్టి, తన దివ్యగళంతో దిగంతాలకూ వ్యాపించిందా ఆ సమ్మోహనపరిమళం! యాభై ఏళ్లకు పైగా తెలుగు పాటంటే.. బాలు.. మంచి మాటంటే బాలు! ఈ పండితారాధ్యుడు పండితులకు పామరులకూ ఆరాధ్యుడే!

తన సంకీర్తనామృతంతో శ్రీనివాసుని పరవశింపజేసిన అన్నమయ్య దూరమవుతుంటే.. సాక్షాత్తూ స్వామివారే ఎలా తల్లడిల్లిపోయారో.. సెల్యులాయిడ్​పై చూశాం. లాలిపాటలు... జోలపాటలు లాంటి 32 వేల సంకీర్తనలతో తనను పరవశింపజేశావని శ్రీవారు అంటుంటే అది హృద్యంగా తాకింది. సాక్షాత్ శ్రీ వేంకటేశ్వరుడే పలికినట్లుగా వినిపించిన ఈ గంభీరగళం నీదే కదా! అన్నమయ్య పాటలకు మురిసి, తల్లడిల్లిపోయిన నీవు.. 40వేల పాటలతో మైమరిపించి...స్వరాల ఊయలూగించి..ఇంకా. ఇంకా వినాలనిపించేంత మత్తును కలిగించి.. ఇలా అర్థాంతరంగా వెళ్లడం న్యాయమా?

sp balu special story
ఎస్పీ బాలు

"మరణమనేది.. ఖాయమని.. మిగిలెను కీర్తి కాయమని" నువ్వు పాటలో చెప్పినా.. " నరుడు బ్రతుకు.. నటన.. ఈశ్వరుడి తలపు ఘటన" అని బతుకు పరమార్థాన్ని వివరించినా.. మా తపన ఆగునా! 54 ఏళ్లుగా నీతో పాటు నడిచిన పాట.. ఇప్పుడు... ఒంటరిదైపోయింది. ఇన్నేళ్ల కాలంలో ఎన్నిపాటలతో పరవశించాం.. ఎంత మందిలో నీ గళాన్ని చూసుకున్నాం..? తెలుగు సినీ కళామతల్లికి రెండు కళ్ల లాంటి ఎన్టీఆర్, ఏఎన్నార్​లకు, తర్వాత తరంలోని కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబులకు, ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వెంకటేశ్​ల నుంచి నేటి నవతరంలోని శర్వానంద్ వరకూ గళాన్నందించావ్. తాతలకు.. మనవళ్లకూ కూడా పాటలు పడిన ఘనత నీకు మాత్రమే కదా!

లాలి పాటలు, జోలపాటలు, చిలిపిపాటలు, కొంటెపాటలు, యుగళగీతాలు, శృంగార గీతాలు, భక్తి పాటలు , ముక్తి పాటలతో రక్తి కట్టించావు. రసరమ్యమైన పాటలతో ప్రతీరాత్రిని వసంతరాత్రులు చేశావు. సింధూరపు మందారపు వన్నెలను వాకిళ్లకు తెచ్చావు. దివిలో విరిసిన పారిజాతాలను మా పెరటిలో పరిమళింపజేశావు. సినిమాలో ఎన్టీఆర్ ఉంటే.. పాడేది బాలూ కాదు.. ఎన్టీఆరే.. ఏఎన్నార్ ఆడుతుంటే.. గొంతకట్టేది.. కూడా ఏఎన్నారే అన్నట్లుగా ఉండేవి ఆ పాటలు. కథానాయకుల బాడీలాంగ్వేజ్​కు తగ్గట్టుగా ధ్వన్యనుసరణ చేసి.. వారిని ఆవహించినట్లుగా ఆలపించడం ప్రపంచ చరిత్రలో నీవు తప్ప మరే గాయకుడూ చేసిన దాఖలా లేదు. ఒక్క ఎస్పీబీకి మాత్రమే అది సాధ్యమైంది. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు, జననీ జన్మభూమీశ్చ అంటూ.. పుణ్యభూమి నాదేశం నమో నమామీ అంటూ ఎన్టీఆర్ తెరపై కనిపిస్తుంటే.. వాటికి గళం ఇచ్చింది బాలూ అన్న ధ్యాసకూడా ఎవరికీ రాలేదు. నేను పుట్టాను లోకం నవ్వింది... డోన్ట్ కేర్ అని ఏఎన్నార్ అంటే... దాని వెనుక బాలూ ఉన్నాడని ఎవరికీ అసలు ఆలోచనే రాదు. పాటల అవకాశాలకోసం నిరీక్షించే పరిస్థితి నుంచి బయటపడి సంగీత దర్శక, నిర్మాతలను, కథానాయకులను మీ పాటకోసం నిరీక్షించే పరిస్థితిని సృష్టించుకున్నారు.

sp balu special story
ఎస్పీ బాలు

"ప్రియతమా... నా హృదయమా" అంటూ బాలు గుండెల్లో నుంచి వచ్చిన పాటతో.. ప్రేమికుల హృదయాలు ఉప్పొంగాయి. "ప్రేమ ఎంత మధురం..." అంటూ పాడిన గీతంతో భగ్నప్రేమికులు తమను తాము చూసుకున్నారు. తొలినాళ్లలో కథానాయకుల గొంతులను అనుసరించిన మీ పాట.. ఏ విధమైన ఇమేజ్, లేని కొత్త హీరోలకూ అంతే నప్పింది. 90లలో మీరు పాడిన ప్రేమగీతాలు.. లక్షల్లో క్యాసెట్ల 'రికార్డులకెక్కి' రికార్డులు సృష్టించాయి. 50 ఏళ్లుగా పాడుతున్నా.. ఆ గళంలో ఫ్రెష్​నెస్ ఏమాత్రం తగ్గలేదు. ఆ గొంతు అప్పట్లో ఎలా ఉందో.. ఇప్పుడూ అంతే..! ఈ మధ్య మీరు శర్వానంద్ కు పాడిన "నిలువదే మరి నిలువదే " పాటను విన్నా.... పలాస సినిమాలో కొత్తబ్బాయి కరుణాకర్​కు పాడిన సొగసరి పాట చూసినా.. కొన్ని నెలల కిందటే వచ్చిన డిస్కో రాజాలో "నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో" పాట విన్నా... 80లలో బాలుకు.. ఇప్పటి బాలుకూ ఏం తేడా లేదు. సేమ్ టూ సేమ్. అందుకే బాలూ అంటే బాలూనే .. ఎవర్ గ్రీన్.

అలాంటి గళం కాబట్టే.. అన్ని భాషలు అందలం ఎక్కించాయి. దక్షిణాదిలో అన్ని భాషల్లో కొన్ని దశాబ్దాల పాటు మీది సింగిల్ కార్డ్. ఉత్తరాది గాయకుల ప్రాబల్యం ఉండే బాలీవుడ్ లోనూ సత్తా చూపించారు. ఉత్తరం, దక్షిణం ఏంటి.. దేశంలోని 16 భాషల్లో మీ పాటలు మార్మోగిపోయాయి. తెలుగులో ఆరుద్ర, ఆత్రేయ, వేటూరి, వెన్నలకంటి, సిరివెన్నెల లాంటి అత్యుత్తమ గీత రచయతల సాహిత్యానికి బాలూ గీతం వన్నెలద్దింది. అసలు లిపే లేని కొంకిణి, గోండు భాషల్లోనూ ఆ గళం పలికింది.

ఒక్కపాటలేంటి.. దేవతలకు స్వరార్చన చేసిన ఆ గళమే .. దేవభాషను పలికింది. అన్నమయ్యలో బాలూ గళం వింటే సాక్షాత్తూ శ్రీవేంకటేశ్వరుడు మాట్లాడితే అలాగే ఉంటుందా అనిపించింది మాకు.. . కమల్, రజినీ, రఘువరన్ లాంటి అతిరధులకు మీరిచ్చిన గొంతు అద్భుతంగా నప్పింది. కొన్నాళ్ల వరకూ కమల్ తెలుగులో మాట్లాడితే.. అది బాలూనా,.. కమల్ ఒరిజినల్​ అన్నది కూడా గుర్తించడం కష్టమైంది. చేసినవి తక్కువ సినిమాలు అయినా... అన్నింటిలోనూ అద్భుతమైన నటనతో మప్పించారు. మిధునంలో అప్పదాసుగా బాలుడిగా చిలిపితనాన్ని.. సంక్షిష్టతను ఎలా మర్చిపోగలం? పాతికేళ్లుగా 'పాడుతాతీయగా'తో పాటకు పట్టాభిషేకం చేస్తున్నారు. పాతతరాల పాటల ఊసులను నేటితరానికి తెలియజేస్తున్నారు.. ఒక్కటేమిటి.. మీరు బహుపాత్రల బాటసారి..! ఇప్పుడవన్నీ ఎలా?

నువ్వు గాన గంధర్వుడివని అందరూ అంటారు. గంధర్వుడు నీకన్నా బాగా పాడతాడని మేమెట్టా నమ్మేది. అసలు నీకన్నా బాగా పాడగలిగేవాడు ఉంటాడని ఎట్లా ఊహించేది. ఇలా జరుగుతుందని.. "ఒక్కడై రావడం.. ఒక్కడై పోవడం విధిలీల " అని నీ పాటలతోనే తెలిపినా.. నిను మరువలేకున్నామే! ఎలా మరువగలం.. ఒకటా రెండా.. కొన్ని వేల పాటలు.. ఏ ఇంట్లో ఎప్పుడూ టీవీ మోగినా... ఏ గుడిలో ఏ భక్తిపాట వినిపించినా.. నువ్వు వినిపిస్తూనే ఉంటావ్​గా! నువ్వు గంధర్వుడివో.. అంతకన్నా గొప్పో... మాకు తెలీదు.. కానీ.. నువ్వు పుట్టిన తరంలో మేముండటమ్.. నిజంగా మా అదృష్టం!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.