స్వరంలో అమృత ఝరి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆయన పాట వింటే ఆబాలగోపాలం ఆనంద పరవశంలో మునిగితేలాల్సిందే. అందుకే గాన గంధర్వుడిగా బాలు ఖ్యాతికెక్కారు. పదకొండు భాషల్లో నలభై వేలకుపైగా పాటలు పాడిన ఘనత ఆయనకే సొంతం. పెద్ద సంఖ్యలో చిత్రాలకు సంగీత దర్శకత్వమూ వహించారు. లాక్‌డౌన్‌లో ఈ పాటల రారాజు ఏం చేశారు? ఆయన మాటల్లోనే.
"ఈ లాక్‌డౌన్‌లో ఎస్పీబీ ఫ్యాన్స్ ఛారిటబుల్ ఫౌండేషన్ తరఫున ఫిబ్రవరి 28న నుంచి 52 రోజుల పాటు 'శ్రోతలు కోరిన పాటలు' పేరిట కార్యక్రమం నిర్వహించాం. పాటకు రూ.వంద ఇచ్చినా సరే, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అభిమానులు కోరిన పాటలు వినిపించాను. పాటకు రూ.లక్ష వరకూ ఇచ్చిన వారూ ఉన్నారు. చాలామంది పాత పాటలు అడగటం వల్ల పుస్తకాల్లో ఉన్న వాటిని వెతికి పట్టుకుని, సాధన చేసి ఆలపించాను. దీనికోసం చాలా కష్టపడాల్సొచ్చింది. కానీ, దీని ద్వారా లభించిన తృప్తి మాటల్లో చెప్పలేను. ఇలా 52 రోజుల్లో దాదాపు 20 లక్షల రూపాయలు పోగయ్యాయి. వీటితో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళల్లో లాక్‌డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న సంగీత కళాకారులు, ముఖ్యంగా వేదికల మీద పాడుతూ పొట్ట పోసుకునే రెండొందల మందికి సాయం చేస్తున్నాం" అని బాలు చెప్పారు.
పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి: