తమిళ నటుడు సూర్య (Suriya) కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సూరారై పొట్రు' (Soorarai Pottru). తెలుగులో ఈ సినిమా 'ఆకాశం నీ హద్దురా' (Aakasam Nee Haddura) పేరుతో విడుదలైంది. ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో అపర్ణ బాలమురళి కథానాయికగా నటించింది. కరోనా కారణంగా గతేడాది ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విశేషాదరణ దక్కించుకుంది. ఇప్పుడీ సినిమాను హిందీలో రీమేక్ (Soorarai Pottru Remake) చేసేందుకు రంగం సిద్ధమైంది. అబుండాంటియా ఎంటర్టైన్మెంట్స్, 2డీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. మాతృకను తెరకెక్కించిన సుధా కొంగర దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇందులో నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
'భుజ్' ట్రైలర్
బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్ (Ajay Devgan), సంజయ్ దత్ (Sanjay Dutt) ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' (Bhuj: The Pride of India). 1971లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంగా సినిమాను రూపొందించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు చోట్ల థియేటర్లు ఇంకా తెరచుకోకపోవడం వల్ల ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది. ఆగస్టు 13న డిస్నీ+హాట్‌స్టార్‌లో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆకట్టుకునే విజువల్స్‌తో రూపొందిన ఈ ప్రచార చిత్రం అంచనాల్ని పెంచుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'రామారావు'గా రవితేజ
రవితేజ (Ravi Teja) హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మాత. దివ్యాంశ కౌశిక్(Divyansha Kaushik) కథానాయిక. ఇటీవలే హైదరాబాద్‌లో చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం నేడు (సోమవారం) విడుదల చేసింది. 'రామారావు' టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రానికి 'ఆన్ డ్యూటీ' అనేది ఉపశీర్షిక. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన విలేజ్ సెట్‌లో ఈ సినిమా రెండో షెడ్యూల్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా రవితేజ, నాయిక దివ్యాంశలపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. మరో 20 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఇక్కడే కొనసాగనుందని సమాచారం.
"వాస్తవ సంఘటనల ఆధారంగా ఓ విభిన్నమైన థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో రవితేజ ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు. ఆయన కనిపించే విధానం, పాత్ర చిత్రణ చాలా కొత్తగా ఉంటాయి" అని చిత్ర బృందం తెలియజేసింది. రవితేజ ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే 'ఖిలాడి' కోసం మళ్లీ రంగంలోకి దిగనున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా.. ప్రస్తుతం తుదిదశ చిత్రీకరణలో ఉంది.
ఇదీ చూడండి.. రవితేజ కొత్త లుక్.. డ్యూయెట్‌తో విజయ్ 'బీస్ట్'