ETV Bharat / sitara

ఆ పిల్లలకు ఉచిత విద్య అందించండి: సోనూసూద్ - Sonu Sood free education

కొవిడ్​తో మరణించిన వారి పిల్లలకు ప్రభుత్వం సాయం చేయాలని సోనూసూద్ అన్నారు. అలానే ఆ చిన్నారులకు ఉచిత విద్య అందించాలని కోరారు.

Sonu Sood appeals to govt to provide free education to children
సోనూసూద్
author img

By

Published : Apr 30, 2021, 1:40 PM IST

Updated : Apr 30, 2021, 2:45 PM IST

కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేయాలని ప్రముఖ నటుడు సోనూసూద్‌ కోరారు. కొవిడ్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంతోమందికి సాయం చేస్తోన్న ఆయన ఓ వీడియో షేర్‌ చేశారు. దేశంలో నానాటికీ విజృంభిస్తోన్న కరోనా వల్ల ఎంతోమంది చనిపోతున్నారని.. దాని వల్ల వారి పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారతోందని సోనూ ఆవేదన వ్యక్తం చేశారు.

'ఎనిమిది నుంచి 12 సంవత్సరాలు వయసున్న ఎంతోమంది చిన్నారులు కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోతున్నారు. అలాంటి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే నాకెంతో బాధగా అనిపిస్తోంది. కాబట్టి ఆ చిన్నారులకు అండగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు సంబంధిత ఎన్జీవోలను కోరుతున్నాను. అలాగే, ప్రాథమిక స్కూల్‌ నుంచి కళాశాల వరకూ వాళ్లకు ఉచిత విద్య అందించాలని అభ్యర్థిస్తున్నాను' అని సోనూ విజ్ఞప్తి చేశారు.

Last Updated : Apr 30, 2021, 2:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.