Sonam Kapoor Pregnancy: బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తల్లి కాబోతోంది. తాను మొదటిసారి గర్భం దాల్చినట్లు సోనమ్ కపూర్ తెలిపింది. భర్త ఆనంద్ ఆహుజాతో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ విషయంపై ఆనంద్ ఆహుజా ఆనందం వ్యక్తం చేశాడు.
పుట్టబోయే శిశువును ఉద్దేశిస్తూ.. 'మిమ్మల్ని ఉత్తమంగా పెంచగలం. మా రెండు హృదయాలు మీతోపాటే కొట్టుకుంటాయి. ప్రేమానురాగాలు పంచే కుటుంబం మీకు ఉంటుంది. మిమ్మల్ని త్వరగా ఆహ్వానిస్తున్నాం' అని హ్యాష్‌ట్యాగ్‌లో రాసుకొచ్చింది సోనమ్.
సోనమ్‌కు పలువురు సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలిపారు. 'పిల్లలతో ఆడుకోవడానికి సిద్ధంగా ఉండండి' అంటూ సోనమ్ జంటకు కరీనా కపూర్ పేర్కొంది. 'చాలా మంచి శుభవార్త' అంటూ దియా మిర్జా తెలిపింది. అనన్య పాండే సహా పలువురు నటీనటులు సోనమ్ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
సోనమ్ కపూర్, ఆనంద్ అహుజాకు 2018లో వివాహం అయ్యింది. సోనమ్ కపూర్.. నటుడు అనిల్ కపూర్, సునీత కపూర్ పెద్ద కుమార్తె. సోనమ్ పెళ్లి అయినప్పటి నుంచీ చాలా సార్లు ప్రెగ్నెన్సీ పుకార్లు వచ్చాయి. అయితే.. వాటిని ఆమె ఖండిస్తూ వచ్చింది.
ఇదీ చదవండి: అమృత్‌సర్‌లో 'ఆర్ఆర్ఆర్' టీమ్.. 'కేజీఎఫ్-2' నుంచి 'తుఫాన్'