ETV Bharat / sitara

'ఆకలితో పడుకున్నా.. ఖాళీ జేబులతో తిరిగాను' - solo bratuke so better dierctor subbu cini journey

తన జీవితం, తన స్నేహితుల జీవితాల్లో చూసిన సంఘటనల ఆధారంగానే 'సోలో బ్రతుకే సోబెటర్'​ దర్శకుడు సుబ్బు. తన సినీ ప్రయాణంలో ఆకలితో పస్తులు పడుకున్న రోజులు.. ఖాళీ జేబులతో తిరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయని చెప్పారు. దీంతో పాటు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

subbu
సుబ్రు
author img

By

Published : Dec 27, 2020, 6:50 AM IST

"మనం ఒక కథ చెప్పామంటే.. అందరికీ కనెక్ట్‌ అయ్యేలా ఉండాలి. సినిమా చూసిన ప్రతిఒక్కరూ కథలో తమని తాము చూసుకోవాలి. వినోదంతో పాటు సమాజానికి మంచి సందేశం ఇచ్చామనిపించాలి. ప్రేక్షకుల మదిలో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలి.. అదే నా లక్ష్యం" అంటున్నారు సుబ్బు. 'సోలో బ్రతుకే సోబెటర్‌' చిత్రంతో తెలుగు తెరపై మెరిసిన కొత్త దర్శకుడాయన. సాయితేజ్‌ కథా నాయకుడిగా నటించిన చిత్రమిది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

"నా జీవితం.. నా స్నేహితుల జీవితాల్లో చూసిన సంఘటనలకు ప్రతిరూపమే ఈ 'సోలో బ్రతుకే సోబెటర్‌'. అలాగని నా జీవితంలో ప్రేమకథలు ఏమీ లేవు లేండి (నవ్వుతూ). ఇప్పటికీ నేను సింగిల్‌గానే ఉన్నా. 'పెళ్లి చేసుకోవాలా.. సింగిల్‌గా ఉండాలా?, అసలు పెళ్లి అనేది అవసరమా?, చేసుకొని మన లైఫ్‌ను వేరొకరి చేతుల్లో ఎందుకు పెట్టాలి'.. ఇలాంటి ప్రశ్నలన్నీ ఏదొక సందర్భంలో అందరి మనసుల్లో మెదిలేవే. అందుకే ఇలాంటి కథ అయితే అందరికీ కనెక్ట్‌ అవుతుందనిపించి.. 'సోలో ఫిలాసఫీ'ని తెరపైకి తీసుకొచ్చా. కథ రాసుకున్నాక.. దీనికి తేజు అయితేనే సరిగ్గా సరిపోతాడనిపించింది. దీంతో ఆయన్ని కలిసి కథ చెప్పా. తనకీ బాగా నచ్చడం వల్ల వెంటనే ఓకే చేశారు. దర్శకుడిగా నాకిది తొలి చిత్రమైనా.. ఈ ప్రయాణం ఇంత సాఫీగా జరిగిపోయిందంటే దానికి తేజు, చిత్ర నిర్మాతలిచ్చిన మద్దతే కారణం".

బాధగా అనిపించినా.. మేలే జరిగింది

"చిత్రసీమకి ఎంతో అవసరమైన సమయంలో ఓ పెద్ద బాధ్యతను మోస్తూ దర్శకుడిగా తెలుగు తెరపైకి అడుగుపెట్టడం నాకెప్పటికీ గుర్తుండిపోతుంది. దీనికితోడు సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతుండటం.. పరిశ్రమ పెద్దల నుంచి ఇంత గొప్ప మద్దతు దక్కడం.. ఇవన్నీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. తొలుత మే 1న రిలీజ్‌ వాయిదా పడినప్పుడు కాస్త బాధగా అనిపించినా.. దాని వల్ల మేలే కలిగింది. సినిమాను మరింత బాగా తయారు చేసుకునే అవకాశం వచ్చింది.’’

పూరి స్ఫూర్తితోనే..

"నేను పుట్టి పెరిగిందంతా తూర్పుగోదావరి జిల్లా తునిలోనే. ఇంటర్మీడియట్‌ వరకు అక్కడే చదివా. తర్వాత ఇంజినీరింగ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చా. చిన్నప్పటి నుంచీ సినిమాలపై ఆసక్తిగా బాగా ఉండేది. దర్శకత్వం వైపు అడుగేయడానికి పూరి జగన్నాథ్‌ స్ఫూర్తి. ఆయనది మా దగ్గరి ఊరే. అక్కడి నుంచి వచ్చిన ఆయన ఇంత పెద్ద ఇండస్ట్రీలో గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకోగలిగినప్పుడు.. మనమెందుకు ఆ ప్రయత్నం చేయలేం అనిపించింది. అలా ఆయన స్ఫూర్తితోనే 2010లో చిత్ర సీమలోకి అడుగుపెట్టా. తొలుత కెమెరామెన్‌ రసూల్‌ దగ్గర 'ఊసరవల్లి' చిత్రానికి పనిచేశా. తర్వాత బొమ్మరిల్లు భాస్కర్‌, విరించి వర్మ వంటి దర్శకుల వద్ద పనిచేశా. ఈ ప్రయాణంలో చాలా సినిమా కష్టాలూ అనుభవించా. ఆకలితో పస్తులు పడుకున్న రోజులు.. ఖాళీ జేబులతో తిరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మనసుకు బాగా కష్టంగా అనిపించిన ప్రతిసారీ.. 'రేపు మనదే. కచ్చితంగా మనకి మంచి అవకాశమొస్తుంది' అని నాలో నేను స్ఫూర్తి నింపుకొనే వాడిని.

అమ్మ దగ్గరికి వెళ్లిపోవాలి

"నేను హైదరాబాద్‌కు వచ్చి దాదాపు 14ఏళ్లు కావొస్తుంది. ఇన్నేళ్లు అమ్మకు చాలా దూరంగా ఉండిపోయా. తనను నా దగ్గరే ఉంచుకుందాం అంటే.. ఇక్కడి వాతావరణం తనకు నచ్చదు. అందుకే ఓ ఐదేళ్లు బాగాకష్టపడి.. కనీసం ఐదు మంచి సినిమాలైనా చేసి అమ్మ దగ్గరికి తిరిగి వెళ్లిపోవాలి అనిపిస్తుంది. 'తనని బాగా చూసుకోవాలి. ఇన్ని సంవత్సరాలు కోల్పోయిన ఆనందాన్ని తిరిగి పొందాలి.. తనకి అందివ్వాలి అన్నది నా బలమైన కోరిక. ఇదే విషయాన్ని తేజుతో చెప్తే.. 'నీకు మంచి ప్రతిభ ఉంది. నువ్వు ఐదు కాదు.. 50 సినిమాలు తీయాలి' అన్నారు. అయితే భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది దేవుడి నిర్ణయం కదా. నాకు చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ అంటే చాలా ఇష్టం. వాళ్లతో సినిమా చేయాలన్నది నా కోరిక. ప్రస్తుతం నాలుగైదు కథలు సిద్ధంగా ఉన్నాయి. ఎస్వీసీసీ బ్యానర్‌లోనే ఇంకో సినిమా చేయనున్నా. ఏ కథతో సెట్స్‌పైకి వెళ్లాలన్నది సంక్రాంతి తర్వాత ఫైనల్‌ చేసుకుంటా".

ఇదీ చూడండి : అందుకే పేరు మార్చుకున్నా: సాయితేజ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.