సొగ్గాడే చిన్నినాయనా సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఎప్పుడో పట్టాలెక్కాల్సిన ఈ చిత్రం ఆలస్యమైంది. ఈ సినిమా దర్శకుడు కల్యాణకృష్ణ సోదరుడి మరణం తదితర కారణాల వల్ల ప్రారంభం కాలేదు.
ప్రస్తుతం స్క్రిప్ట్ పూర్తయ్యే దశలో ఉందని... చిత్రం అక్టోబర్‌లో పట్టాలెక్కనుందని సమాచారం. అనుకున్న సమయానికి షూటింగ్ మెుదలయితే, వచ్చే వేసవిలో సినిమాలో విడుదలకానుంది.
ఇందులో నాగ్ సరసన రమ్యకృష్ణ కనిపంచనుందని, నాగచైతన్య ప్రత్యేక పాత్రలో నటించనున్నాడని సమాచారం. నిర్మాతగా నాగార్జున వ్యవహరించనున్నాడు.
ఇదీ చూడండి: 'సాహో 2'కు అప్పుడే కథ రాసేశారా...!