"సినిమా బాగుందని ఒకటి రెండు లైన్లలో చెప్పడం లేదు. ఓ ప్రేమ లేఖలా రాస్తున్నారు. అదే మాకు పెద్ద సక్సెస్ అనిపిస్తోంది" అన్నారు కథానాయకుడు నాని. ఆయన నటించిన చిత్రం 'శ్యామ్ సింగరాయ్' ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించారు. వెంకట్ బోయనపల్లి నిర్మాత. సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. ఇటీవలే విజయోత్సవ వేడుకని నిర్వహించిన చిత్రబృందం తాజాగా ఈ చిత్రబృందం సిరివెన్నెల పాట విడియో వెర్షన్ను యూ ట్యూబ్లో విడుదల చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">