Balakrishna at Sirivennela last rites: తెలుగు భాషకు, సాహిత్యానికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి అలంకారమని అగ్రనటుడు బాలకృష్ణ అన్నారు. సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న మహానుభావుడు సిరివెన్నెల అని కీర్తించారు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని అన్నారు.
ఫిలిం ఛాంబర్లో సిరివెన్నెల భౌతికకాయాన్ని దర్శించుకున్న బాలకృష్ణ.. సిరివెన్నెల మరణంపై మాట్లాడేందుకు మాటలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
"సిరివెన్నెల మరణం నమ్మలేని నిజం. పవిత్ర వాణి వాగ్భూషణమే మనిషికి భూషణం. తెలుగు భాషకు, సాహిత్యానికి సిరివెన్నెల భూషణం వంటి వ్యక్తి."
-బాలకృష్ణ, అగ్రకథానాయకుడు
సిరివెన్నెల సీతారామ శాస్త్రి.. న్యూమోనియాకు చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్లో ఉంచారు. అగ్రనటులు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సహా పలువురు సినీ ప్రముఖులు ఆయన పార్థివదేహాన్ని దర్శించుకున్నారు.
చివరి దిగ్గజం: చిరంజీవి
ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి తెలుగు సినీ పరిశ్రమకు చిట్టచివరి సాహితీ దిగ్గజంగా నిలిచిపోతారని పేర్కొన్నారు. ఆయనలా సాహిత్య సేవ చేసే వారు మరొకరు రారని అన్నారు. చిరంజీవి ఇంకా ఏం మాట్లాడారో ఈ లింక్‌పై క్లిక్ చేసి తెలుసుకోండి..
3 వేల పాటలు..
మరోవైపు, సిరివెన్నెల మృతితో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన 'సిరివెన్నెల' చిత్రంలో 'విధాత తలపున' గేయంతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన సీతారామ శాస్త్రి ఆ సినిమా టైటిల్‌నే ఇంటిపేరుగా సుస్థిరం చేసుకున్నారు. 800లకు పైగా చిత్రాల్లో దాదాపు 3వేల పాటలు ఆయన హృదయ కమలం నుంచి కలంలోకి చేరి అక్షరాలై శ్రోతలను మంత్ర ముగ్ధులను చేశాయి. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019లో పద్మశ్రీతో సత్కరించింది.
ఇదీ చదవండి: