ETV Bharat / sitara

'తెలుగు పరిశ్రమకు చివరి సాహితీ దిగ్గజం సిరివెన్నెల' - సిరివెన్నెల చిరంజీవి

Sirivennela death chiranjeevi: సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణంతో మంచి మిత్రుడిని కోల్పోయానని అగ్రనటుడు చిరంజీవి అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చివరి సాహితీ దిగ్గజంగా ఆయన చిరకాలం నిలిచిపోతారని పేర్కొన్నారు.

chiranjeevi on sirivennela
chiranjeevi on sirivennela
author img

By

Published : Dec 1, 2021, 12:15 PM IST

చిరంజీవి

Chiranjeevi on Sirivennela: సిరివెన్నెల సీతారామ శాస్త్రి తెలుగు సినీ పరిశ్రమకు చిట్టచివరి సాహితీ దిగ్గజంగా నిలిచిపోతారని అగ్రనటుడు మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. ఆయనలా సాహిత్య సేవ చేసే వారు మరొకరు రారని అన్నారు. సిరివెన్నెల మరణంతో మంచి మిత్రుడిని కోల్పోయానన్న భావన కలుగుతోందని భావోద్వేగానికి లోనయ్యారు. సిరివెన్నెల తన గురించి పాటలు రాయడం అదృష్టమని అన్నారు.

"తెలుగు పరిశ్రమకు ఇది చాలా పెద్ద లోటు. ఎవరూ భర్తీ చేయలేని లోటు. ఇది చాలా దురదృష్టకరం. ఇలా సుదీర్ఘంగా సాహిత్య సేవ చేసే వారు ఈ పరిశ్రమకు మరొకరు రారు. సాహిత్య పరిశ్రమకు చివరి లెజెండ్ ఆయనే. ఆయనను స్మరించుకోవడం చాలా అవసరం. సిరివెన్నెల సన్నిహితులు, త్రివిక్రమ్​తో చర్చించి సిరివెన్నెలను స్మరించుకునేలా ఏదైనా కార్యక్రమాలు చేపడతాం."

-చిరంజీవి, అగ్రనటుడు

Sirivennela Telugu updates: న్యూమోనియాతో బాధపడుతూ ఇటీవల ఆస్పత్రిలో చేరిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన మృతితో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన 'సిరివెన్నెల' చిత్రంలో 'విధాత తలపున' గేయంతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఆ సినిమా టైటిల్‌నే ఇంటిపేరుగా సుస్థిరం చేసుకున్నారు. 800లకు పైగా చిత్రాల్లో దాదాపు 3వేల పాటలు ఆయన హృదయ కమలం నుంచి కలంలోకి చేరి అక్షరాలై శ్రోతలను మంత్ర ముగ్ధులను చేశాయి. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019లో పద్మశ్రీతో సత్కరించింది.

ఇదీ చదవండి: సాహితీ హిమాలయం సీతారాముడు: ఇళయరాజా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.