వైభవంగా గాయని సునీత వివాహం - వ్యాపారవేత్తతో గాయని సునీత వివాహం
ప్రముఖ నేపథ్యగాయని సునీత వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అతికొద్ది మంది ఆత్మీయులు హాజరయ్యారు. హైదరాబాద్లోని ఓ ఆలయంలో రామ్ వీరపనేనితో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు సునీత.
అంగరంగ వైభవంగా గాయని సునీత వివాహం
ప్రముఖ నేపథ్య గాయని సునీత ద్వితీయ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మ్యాంగోమూవీస్ అధినేత రామ్ వీరపనేని.. సునీత మెడలో మూడుముళ్లు వేశారు. అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లిలోని శ్రీ సీతా రామ చంద్ర స్వామి ఆలయం వేదికగా సునీత- రామ్ల వివాహం జరిగింది.
వీరి వివాహనికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై కొత్తజంటను ఆశీర్వదించారు. సునీత పెళ్లి ఫొటోలను సామజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు అభిమానులు. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇదీ చూడండి: మెహందీ వేడుకలో గాయని సునీత.. ఫొటోస్ వైరల్
Last Updated : Jan 10, 2021, 9:52 AM IST