ప్రముఖ గాయకుడు అర్జిత్ సింగ్ తల్లి అదితీ సింగ్(52) మరణించారు. ఇటీవలే కరోనా బారిన పడిన ఆమె.. కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
అయితే ఆమెకు మే 17న చేసిన కొవిడ్ పరీక్షల్లో నెగెటివ్‌గా తేలింది. కానీ, బుధవారం రాత్రి ఆమెకు తీవ్ర గుండెపోటు రావడం వల్ల అదితీ సింగ్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఇదీ చూడండి.. సమంత డీ-గ్లామర్ పాత్రకు కంగన ఫిదా