ETV Bharat / sitara

శర్వానంద్ సూపర్​ స్పీడ్.. లైన్​లో నాలుగు సినిమాలు - SHARWANAND latest news

ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నానని హీరో శర్వానంద్ తెలిపారు. ఆ వివరాల్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

SHARWANAND FOUR FILMS ON LINE NEWS
శర్వానంద్
author img

By

Published : Oct 25, 2020, 5:56 PM IST

Updated : Oct 25, 2020, 7:31 PM IST

యువ కథానాయకుడు శర్వానంద్ జోరు మాములుగా లేదు. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఆ విషయాన్ని శర్వానే స్వయంగా వెల్లడించారు. ఇంతకీ అవి ఏంటంటే?

SHARWANAND facebok post
శర్వానంద్ ఫేస్​బుక్ పోస్ట్

'శ్రీకారం'లో రైతుగా

నూతన దర్శకుడు కిశోర్ తీస్తున్న 'శ్రీకారం'లో, శర్వానంద్ రైతుగా కనిపించనున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్. 14 రీల్స్ ప్లస్​ పతాకంపై గోపీచంద్, రామ్ ఆచంట నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది విడుదల కానుందీ సినిమా.

sreekaram new look
శ్రీకారం సినిమా కొత్త లుక్

ద్విభాషా చిత్రం

#శర్వానంద్30 పేరుతో రూపొందిస్తున్న ఓ చిత్రంలోనూ శర్వానంద్ నటిస్తున్నారు. శ్రీ కార్తిక్ దర్శకుడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇటీవలే షూటింగ్ కూడా ప్రారంభమైంది.

'మహాసముద్రం'లో సిద్ధార్థ్​తో

'ఆర్ఎక్స్ 100' దర్శకుడు అజయ్ భూపతి తీస్తున్న 'మహాసముద్రం'లోనూ శర్వానంద్ ఓ హీరోగా చేస్తున్నారు. సిద్ధార్థ్ మరో కథానాయకుడు. అదితీ రావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు.

రష్మికతో 'ఆడాళ్లూ మీకు జోహార్లు'

స్టార్ బ్యూటీ రష్మికతోనే నటించేందుకు సిద్ధమయ్యారు శర్వానంద్. కిశోర్ తిరుమల దర్శకత్వంలో 'ఆడాళ్లూ మీకు జోహార్లు' సినిమా చేస్తున్నారు. దసరా సందర్భంగా ఆదివారమే లాంఛనంగా ప్రారంభమైంది.

SHARWANAND new cinema
ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా ప్రారంభోత్సవం

Last Updated : Oct 25, 2020, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.