Jersy release date postpone: కరోనా నుంచి కోలుకుంటున్న చిత్రసీమకు ఒమిక్రాన్ సెగ తగిలింది. కేసులు క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో హిందీ రీమేక్ 'జెర్సీ' చిత్రం వాయిదా పడింది. డిసెంబరు 31న థియేటర్లలో సందడి చేయాల్సిన ఈ మూవీని ప్రస్తుత పరిస్థితుల వల్ల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.
తెలుగులో నేచురల్ స్టార్ నాని నటించిన 'జెర్సీ'ని హిందీలో అదే పేరుతో షాహిద్ కపూర్ రీమేక్ చేశారు. ఇందులో మృణాళిని ఠాకూర్ కథానాయికగా నటించింది. మాతృకకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి దీనికి డైరెక్షన్ చేశారు. క్రికెటర్‌గా చూడాలనుకున్న తన కొడుకు కోరికను తీర్చేందుకు ఓ తండ్రి ఏం చేశాడు? 36ఏళ్ల వయసులో తిరిగి క్రికెట్ బ్యాట్ పడితే అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆటలో గెలిచాడా? జీవితంలో గెలిచాడా? అనేది ఈ చిత్ర కథాంశం.
ఈ ఒమిక్రాన్ ఎఫెక్ట్.. త్వరలో రిలీజ్ కానున్న మిగతా సినిమాలపైనా పడే అవకాశముంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: ''పుష్ప' కలెక్షన్లను హిందీ సినిమాలూ అందుకోలేకపోతున్నాయి'