బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, తమిళ నటుడు విజయ్ సేతుపతి కలిసి డిజిటల్ అరంగేట్రం చేయనున్నారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' ఫేమ్ రాజ్, డీకే తెరకెక్కించనున్న ఓ వెబ్‌సిరీస్‌లో వీరిద్దరు నటించబోతున్నారు. మంగళవారం ఈ సిరీస్‌కు సంబంధించిన టైటిల్‌ను 'గవర్'గా ప్రకటించింది చిత్రబృందం.
ఇందులో వీరిద్దరి పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయట. అమెజాన్ ప్రైమ్ నిర్మాణంలో ఈ సిరీస్ రూపుదిద్దుకోనుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సిరీస్‌కు సంబంధించిన చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ముంబయి, గోవాలోని పలు ప్రదేశాల్లో షూటింగ్ జరుగుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ప్రస్తుతం విజయ్ సేతుపతి బాలీవుడ్‌లో 'లాల్ సింగ్ చద్దా' చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. 'నవరస' 'కాతువాకుల రెండు కాదల్' చిత్రాల్లోనూ నటిస్తున్నారు. మరోవైపు షాహిద్ త్వరలోనే 'జెర్సీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి : ఆ చిత్రం నుంచి తప్పుకున్న షాహిద్?