ఆగస్టు 8న ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 10వ ఎడిషన్‌కు సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ముఖ్య అతిథిగా వెళ్లనున్నాడు. విక్టోరియా తొలి మహిళా గవర్నర్ లిండా డెసౌ చేతుల మీదుగా 'ఎక్సలెన్స్ ఇన్ సినిమా' అవార్డు అందుకోనున్నాడు.
"ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా. ఈ వేడుకలకు దేశం నలుమూలల నుంచి వస్తున్న ప్రముఖలను కలవడం మంచి అనుభవంగా భావిస్తా. లిండా డెసౌను కలిసేందుకు ఎదురుచూస్తున్నా" -షారుఖ్, బాలీవుడ్ నటుడు.
"హిందీ సినిమా మార్గదర్శకుల్లో షారుఖ్ ఒకరు. ఈ రంగంలో అతని సహకారం చాలా ఉంది. బాలీవుడ్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి తీసుకొచ్చి, కోట్ల మందిపై ప్రభావం చూపారు." - మితు భౌమిక్, ఫెస్టివల్ డైరెక్టర్.
ఇదిచదవండి: కాజోల్ నీ అందానికి అతి నిద్ర అవసరమే లేదు...!