తమిళనాడు ముఖ్యమంత్రి, దివంగత జయలలిత జీవితకథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'తలైవి'. కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తుంది. ఏఎల్ విజయ్ దర్శకుడు. అయితే శశికళ పాత్ర ఎవరు చేస్తున్నారనే విషయం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇప్పుడు ఈ విషయంపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.
తలైవి చివరి రోజుల్లో ఆమె వెన్నంటి ఉన్నది శశికళనే. ఇప్పుడీ పాత్ర కోసం 'సీమటపాకాయ్', 'అవును' సినిమాల ఫేమ్ పూర్ణను ఎంపిక చిత్రబృందం ఎంపిక చేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.
'అవును, 'అవును 2' వంటి చిత్రాలతో అందరి దృష్టినీ ఆకర్షించింది పూర్ణ. కానీ, ఆమెకు తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇలాంటి తరుణంలో 'తలైవి' వంటి పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్రలో ఛాన్స్ కొట్టేసిందని టాక్.
ఇదీ చూడండి : 'తలైవి'లో శోభన్‌బాబు దొరికేశాడు..!