ETV Bharat / sitara

సాంగ్​తో మహేశ్​.. రామ్​చరణ్-శంకర్​ సినిమా అప్డేట్​​! - ఆర్​ సీ 15 మూవీ అప్డేట్​

Sarkaru vaari pata song released: కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో 'మహేశ్​ సర్కారు వారి పాట', రామ్​చరణ్​-శంకర్​ కాంబో సినిమా వివరాలు ఉన్నాయి.

Sarkaru vaari pata song released
మహేశ్​ సర్కారు వారి పాట
author img

By

Published : Feb 13, 2022, 4:12 PM IST

Sarkaru Vaari Paata Song: సూపర్​స్టార్ మహేశ్​బాబు హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'సర్కారు వారి పాట'. శనివారం ఈ చిత్రంలోని లీకైన 'కళావతి' పాటను అధికారికంగా విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో కీర్తిసురేశ్​ హీరోయిన్​గా నటించింది. తమన్​ సంగీతమందించారు. పరశురామ్​ దర్శకత్వం వహించారు. మైత్రీమూవీ మేకర్స్​ విడుదల చేసిన ఈ మూవీ మే 12న థియేటర్లలోకి రానుంది.

కాగా, మహేశ్​బాబు- ఆయన కూతురు సితారకు సంబంధించిన రెండు ఫొటోలు అభిమానులను తెగ అలరిస్తున్నాయి. ఇందులో వీరిద్దరూ సరదాగా ఫైటింగ్​ చేస్తూ కనిపించారు. 'ఆదివారం సెలవు రోజున నాన్న ప్రశాంతంగా గడపకుండా దాన్ని చెడగొట్టే మిషన్​లో పాల్గొంటూ బిజీగా ఉన్నా' అంటూ సితార కామెంట్​ చేసింది. 'అయ్యయ్యో వద్దమ్మా' అంటూ మహేశ్​ ఫ్యాన్స్​ కామెంట్స్​ చేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Ramcharan Shankar movie: రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. ఇందులో చరణ్‌ రెండు విభిన్న గెటప్పులో కనిపిస్తారట. ఉన్నతాధికారిగా ఒక గెటప్‌లో సీరియస్‌గా కనిపిస్తూనే సాధారణ వ్యక్తిగా మరో గెటప్‌లో అలరించనున్నారట.

కాగా, ఈ సినిమా షూటింగ్​ కోసం ఆయన నేడు(ఆదివారం) రాజమండ్రి చేరుకున్నరని తెలిసింది! దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్​ అవుతున్నాయి. ఇక ఈ మూవీలో కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తోంది. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సెట్స్‌పైన ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.

ramcharan
రామ్​చరణ్​

ఇదీ చూడండి: నేహాశెట్టి ఎమోషనల్​.. ఆ వ్యక్తి తనతో లేరంటూ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.