ETV Bharat / sitara

నర్సు గెటప్​లో ధావన్.. పరిచయం చేసిన సారా - hottest nurse Varuna Dhawan

'కూలీ నెం.1' సినిమాలోని ఓ సన్నివేశంలో నర్సు వేషధారణలో కనిపించాడు హీరో వరుణ్​ ధావన్​. తాజాగా ఆ సీన్​కు సంబంధించిన చిత్రీకరణ వీడియోను పోస్ట్​ చేసింది హీరోయిన్​ సారా అలీఖాన్. ఆ వీడియో నెటిజన్లను విపరీతంగా నవ్విస్తోంది

Sara Ali Khan i
లేడీ వరుణ్​ ధావన్
author img

By

Published : Dec 17, 2020, 4:36 PM IST

Updated : Dec 17, 2020, 6:18 PM IST

వరుణ్​ ధావన్​, సారా అలీఖాన్​ జంటగా నటించిన సినిమా 'కూలీ నెం.1'. దీనికి సంబంధించిన ట్రైలర్​ ఇటీవల విడుదలై సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంది. ఇందులో వరుణ్..​ ఓ నర్సు వేషధారణలో కనిపించి అభిమానుల చేత విపరీతంగా నవ్వులు పూయించాడు.

అయితే తాజాగా ఆ సన్నివేశానికి సంబంధించిన చిత్రీకరణ వీడియోను పోస్ట్​ చేసింది సారా. "ఈ అందమైన హాట్​ నర్సు వరుణ్ ధావన్​ను మీకు పరిచయం చేస్తున్నా" అంటూ వ్యాఖ్య రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్లు మరోసారి కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఈ వీడియోను మీరూ చూసేయండి.

1995లో వచ్చిన 'కూలీ నెం.1'కు రీమేక్​గా తెరకెక్కిందీ సినిమా. అందులో గోవింద, కరిష్మా కపూర్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇప్పటి చిత్రంలో వరుణ్-సారా జంటగా కనిపించారు. డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించారు. తండ్రి డైరెక్షన్​లో వరుణ్​ నటించడం ఇది రెండోసారి. క్రిస్మస్​ కానుకగా అమెజాన్​ ప్రైమ్​లో డిసెంబరు 25న విడుదల కానుందీ చిత్రం.

ఇదీ చూడండి : షూటింగ్​కు సిద్ధమైన వరుణ్​, నీతూ కపూర్​!

Last Updated : Dec 17, 2020, 6:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.