"నమ్మకం.. సానుకూల దృక్పథమే ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి మనల్ని రక్షిస్తాయి" అని హీరోయిన్ సమంత చెబుతోంది. తెలుగు, తమిళ చిత్రాల్లో దూసుకుపోతున్న ఈమె.. హిందీలో 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్‌సిరీస్‌లో రాజీ పాత్రలో మెరవనుంది.
"కొవిడ్ చుట్టుముడుతున్న ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ వైరస్‌తో పోరాడగలమన్న ధైర్యం ఉండాలి. ఎలాంటి స్థితి ఎదురైనా తట్టుకొనే నిలబడగలమనే సానుకూల దృక్పథంతో సాగిపోవాలి. కష్టం వచ్చిందని ప్రాణాలు తీసుకోవడం.. కరోనా సోకిందని ఆత్మహత్యలు చేసుకోవడం చేయొద్దు. ఎలాంటి సమయంలోనూ ధైర్యం కోల్పోవద్దు" అని సామాజిక మాధ్యమాల ద్వారా సమంత రాసుకొచ్చింది. "త్వరలోనే వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వస్తుంది. మాస్క్ పెట్టుకొని, సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉంటే మనం కరోనా జయించవచ్చనే విషయాన్ని మరవొద్దు" అని పేర్కొంది. ప్రస్తుతం సమంతా తెలుగులో గుణశేఖర్ తీస్తున్న 'శాకుంతలం'లో నటిస్తోంది.