యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్ఆర్‌ఆర్'. అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. గతంలో చరణ్ పుట్టిన రోజు సందర్భంగా రామరాజు పాత్రను, ఇటీవల కొమురం భీమ్ పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియోలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
ఈ నేపథ్యంలో కొందరు అభిమానులు ఈ టీజర్‌లను మరిపించేలా స్పూఫ్ వీడియోలు చేస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా అలరిస్తున్నారు. అలా రామరాజు, భీమ్ పాత్రలకు సంబంధించిన టీజర్‌లను విడుదల చేయగా అవి కాస్తా వైరల్‌గా మారాయి. ఆ వీడియోలను చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ అభిమానులతో పంచుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">