ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'ఆర్ఆర్ఆర్'(rrr release date). షూటింగ్ పూర్తయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రం నుంచి మరో అప్డేట్ వచ్చింది. ప్రముఖ థియేటర్ల సంస్థ పీవీఆర్.. ఈ సినిమా(rrr teaser) కోసం తమ పేరు మార్చుకుంది. రాబోయే కొన్ని నెలల పాటు PV'RRR'గానే థియేటర్లపై పేరు ఉండనుంది. ముంబయి అంధేరీలోని ఓ థియేటర్లో చిత్ర దర్శకుడు రాజమౌళి శుక్రవారం ఈ లోగోను ఆవిష్కరించారు.
-
#PVRRR…. 🔥🌊 #RRRMovie
— RRR Movie (@RRRMovie) October 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
For the first time ever in the world, a brand changed their name for the film… For RRR… 🤟🏻
it will be referred as PVRRR for next few months across India in 850+ screens and 170+ properties in 70+ cities… pic.twitter.com/TtcOUSAteL
">#PVRRR…. 🔥🌊 #RRRMovie
— RRR Movie (@RRRMovie) October 29, 2021
For the first time ever in the world, a brand changed their name for the film… For RRR… 🤟🏻
it will be referred as PVRRR for next few months across India in 850+ screens and 170+ properties in 70+ cities… pic.twitter.com/TtcOUSAteL#PVRRR…. 🔥🌊 #RRRMovie
— RRR Movie (@RRRMovie) October 29, 2021
For the first time ever in the world, a brand changed their name for the film… For RRR… 🤟🏻
it will be referred as PVRRR for next few months across India in 850+ screens and 170+ properties in 70+ cities… pic.twitter.com/TtcOUSAteL
అయితే ఓ సినిమా కోసం తమ సంస్థ పేరు మార్చుకోవడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. ఈ ట్రెండ్ భవిష్యత్తులోనూ మరింతగా ఉండే అవకాశముంది. మన దేశంలోని పీవీఆర్‌కు చెందిన 850కి పైగా స్క్రీన్లతో పాటు 70కి పైగా నగరాల్లో ఉన్న 170కి పైగా బిల్డింగ్‌లపై PV'RRR' అనే పేరు దర్శనమివ్వనుందని ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ట్వీట్ చేసింది.
భారత స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవితాల ఆధారంగా తెరకెక్కిన ఫిక్షన్ డ్రామా 'ఆర్ఆర్ఆర్'. అల్లూరిగా రామ్‌చరణ్(ram charan movies), భీమ్‌గా ఎన్టీఆర్ నటించారు. ఆలియా భట్(alia bhatt husband), ఒలీవియా మోరిస్ కథానాయికలు.
అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రఖని తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించగా, ఎస్.ఎస్. రాజమౌళి(rajamouli upcoming movies) దర్శకత్వం వహించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూ.450 కోట్లతో దానయ్య నిర్మించారు. వచ్చే ఏడాది జనవరి 7న థియేటర్లలోకి రానుందీ సినిమా.
ఇవీ చదవండి: