బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ఊహించని ట్విస్టులు ఎదురవుతున్నాయి. ఇటీవలే మనీల్యాండరింగ్ కేసులో భాగంగా రియాను ఎనిమిది గంటలకు పైగా ఈడీ ప్రశ్నించింది. ఈ క్రమంలోనే రియా న్యాయవాది సతీశ్ మానిషిండే ఓ లెటర్‌ను బయటకు తీసుకొచ్చాడు. రియా కుటుంబం తన జీవితంలో ఉన్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సుశాంత్ ఈ నోట్ రాసినట్లు వెల్లడించాడు.
నోట్లో పేర్కొన్న పేర్లపై రియా స్పష్టతనిస్తూ.. "ఇది సుశాంత్ హ్యాండ్ రైటింగ్. లిల్లు అంటే షోయిక్, బెబు అంటే నేను, సర్ మా నాన్న, మామ్ అంటే మా అమ్మ, ఫడ్జ్ అతని కుక్క." అంటూ పేర్కొంది. దీంతో పాటు సుశాంత్‌కు చెందిన సిప్పర్ కూడా ఆమె వద్దే ఉన్నట్లు వివరించింది. తన దగ్గర సుశాంత్ జ్ఞాపకంగా మిగిలిన ఏకైక ఆస్తి ఇదేనని వివరించింది. అయితే, అందులో నోట్ రాసిన సమయం తెలియలేదు.