ETV Bharat / sitara

ప్రభాస్​ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..! - ప్రభాస్​

యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం పూర్తయిన వెంటనే నాగ్​ అశ్విన్​ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీ కోసం అధిక మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నాడని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

rebal star prabhas charges 60 crores for nag ashwin movie
రెబల్​స్టార్​ ప్రభాస్​ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!
author img

By

Published : Mar 3, 2020, 9:30 PM IST

Updated : Mar 3, 2020, 10:41 PM IST

'జిల్‌' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం పూర్తయిన వెంటనే నాగ్‌ అశ్విన్‌ సినిమాలో నటించనున్నాడు ప్రభాస్‌. ఇటీవలే దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ చిత్రానికి ప్రభాస్​ అధిక మొత్తంలో రెమ్యునరేషన్​ తీసుకుంటున్నట్లు టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. ఏకంగా రూ.60 కోట్లు ఇవ్వటానికి వైజయంతి మూవీస్​ సంస్థ సిద్ధమైనట్టు సమాచారం. ఓ భారీ సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో రూపొందబోయే ఈ చిత్రాన్ని.. అన్ని భారతీయ భాషల్లోనూ విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

'సాహో' తర్వాత ప్రభాస్‌ నుంచి రాబోతున్న చిత్రం 'జాన్‌' (వర్కింగ్‌ టైటిల్‌). పూజా హెగ్డే కథానాయిక. ఓ వైవిధ్యమైన పీరియాడికల్‌ ప్రేమకథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 70వ దశకం నాటి యూరప్‌ ప్రాంతంలో సాగే ప్రేమకథగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యూరప్‌లో ఓ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మరికొద్ది రోజుల్లో ఓ కొత్త షెడ్యూల్‌ కోసం మళ్లీ అక్కడకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ షెడ్యూల్‌ గురించి ఓ కీలకవార్త బయటకొచ్చింది.

స్పెషల్ డిజైనింగ్​​ కాస్ట్యూమ్స్​

ఈ చిత్రంలో ప్రభాస్‌ ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ ఎంతో ప్రత్యేకంగా ఉండబోతుందని, అందులో ప్రభాస్‌ కనిపించే విధానం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుందని సమాచారం. ఈ ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌లో ప్రభాస్‌ కోసం కొన్ని ప్రత్యేకమైన కాస్ట్యూమ్స్‌ను సిద్ధం చేసిందట చిత్ర బృందం. ఇంకో రెండు నెలల్లో యూరప్‌లో ఈ కీలక షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. ఈ చిత్రం కోసం 'ఓ డియర్‌', 'రాధే శ్యామ్‌' అనే టైటిల్స్​ను చిత్ర బృందం ఇప్పటికే రిజిస్టర్‌ చేయించింది. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన రానుంది.

ఇదీ చూడండి.. నాగ్​ అశ్విన్​తో ప్రభాస్​ కొత్త చిత్రం..!

Last Updated : Mar 3, 2020, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.