పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ ప్రముఖ హీరోలు మహేశ్‌బాబు, ప్రభాస్‌లకు తల్లిగా నటించేందుకు సిద్ధమని చెప్పింది. తాజాగా జరిగిన ఓ టీవీ లైవ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలు పంచుకుంది.
"టాలీవుడ్ రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నా. ప్రభాస్, మహేశ్‌బాబు వంటి హీరోలకు తల్లి పాత్రలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. దర్శకులు నా పాత్రను బలంగా తీర్చిదిద్దితే, నటించడానికి నేను రెడీ" -రేణు దేశాయ్, నటి-నిర్మాత-దర్శకురాలు
తెలుగులో పవన్‌తో కలిసి 'బద్రి', 'జానీ' సినిమాల్లో నటించిన రేణు.. ఖుషీ, జానీ, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. ఆ తర్వాత పుణె వెళ్లిపోయిన ఈమె... 2012లో 'మంగళస్తక్ వన్ మోర్' అనే మరాఠీ సినిమాను నిర్మించింది. 2014లో వచ్చిన 'ఇష్క్ వాలా లవ్'తో దర్శకురాలిగా తన ప్రతిభ నిరూపించుకుంది.