ETV Bharat / sitara

రానాతో సినిమా చేయాలనుకున్నాం.. కానీ! - rana latest news

యువ దర్శకుడు రవికాంత్ పేరేపు.. తన కొత్త సినిమా 'కృష్ణ అండ్ హిజ్ లీలా' విశేషాలను పంచుకున్నారు. తనకు ఇష్టమైన జానర్​ ఏంటో కూడా చెప్పారు.

రానాతో సినిమా చేయాలనుకున్నాం.. కానీ!
దర్శకుడు రవికాంత్- రానా
author img

By

Published : Jun 27, 2020, 6:20 AM IST

"నేను తీసేది పది, పదిహేను చిత్రాలైనా మంచివి తీయాలనేది నా కోరిక. నిదానంగా చేసినా అలాంటి చిత్రాలే చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నా" అని అంటున్నారు రవికాంత్‌ పేరేపు. 'క్షణం'తో తొలి ప్రయత్నంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన దర్శకుడాయన. రెండో చిత్రంగా 'కృష్ణ అండ్‌ హిస్‌ లీలా'ను తెరకెక్కించారు. రానా సమర్పకుడు. సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్‌, సీరత్‌ కపూర్‌, షాలినీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం 'ఈనాడు సినిమా'తో ప్రత్యేకంగా ముచ్చటించారు దర్శకుడు రవికాంత్‌.

మాది వైజాగ్‌. ఇంజినీరింగ్‌ పూర్తి అవగానే 2012లో హైదరాబాద్‌కు వచ్చేశా. 'క్షణం'కు ముందు అడివి శేష్‌ 'కిస్‌' చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశా. అదంత ఆడలేదు. తర్వాత శేష్‌తో కలిసి 'క్షణం' కథ రాసుకున్నాం.

చిత్ర ఫలితం చూస్తుంటే ఏమనిపిస్తోంది? థియేటర్లలో రిలీజ్‌ చేసుంటే ఇంకా బాగుండేది అనుకున్నారా?

అదేం లేదండి. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో థియేటర్లు ఎలాగూ లేవు కదా. ఇలా సర్దుకుపోవాల్సిందే. మేం దీన్ని థియేటర్లను దృష్టిలో పెట్టుకునే.. రాజీ పడకుండా తెరకెక్కించాం. ఒకవేళ ఇది థియేటర్లకు వెళ్లి ఉంటే ఇందులో చాలా సంభాషణలకు మ్యూట్‌లు పడేవి. ఇప్పుడు డిజిటల్‌లోకి రావడం వల్ల స్వేచ్ఛ దొరికినట్లయింది. అందరూ సిద్ధు, శ్రద్ధా శ్రీనాథ్‌, సీరత్‌ కపూర్‌, షాలినీల నటన గురించి, చిత్ర కథ కథనాల గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. విడుదలైన వేదికేదైనా ఇప్పుడు చిత్రానికి దక్కుతున్న ఆదరణ చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తోంది. జులై 4నుంచి 'ఆహా'లోనూ విడుదల కాబోతుంది.

krishna and his leela cinema
'కృష్ణ అండ్ హిజ్ లీలా' సినిమా

'క్షణం' తర్వాత రెండో చిత్రానికి ఇంత గ్యాప్‌ తీసుకోవడానికి కారణమేంటి?

ఇది కావాలని తీసుకున్న గ్యాప్‌ కాదండి. 'క్షణం' తర్వాత రానాతో చేద్దామనుకున్నాం. నేనొక కథ సిద్ధం చేసుకున్నా. అదెవరికీ అంతగా నచ్చలేదు. తర్వాత ఈ కథ చెప్తే ఆయనకు నచ్చి ప్రొడ్యూస్‌ చేయడానికి ముందుకొచ్చారు. ప్రతి సినిమా విషయంలో ఇలా ఆలస్యం జరుగుతుందనేం చెప్పలేం. కొన్నిసార్లు అలా జరిగిపోతాయి.

రచనా పరంగా 'క్షణం' చిత్రానికీ మంచి స్పందన వచ్చింది. మరి ఈ చిత్ర రచనా విషయంలో ప్రత్యేకంగా మీరెలాంటి కసరత్తులు చేశారు?

ఓ ప్రేక్షకుడు థియేటర్లో కూర్చోని ఎలాంటి చిత్రం చూడాలని కోరుకుంటాడో.. అలాంటి పాయింట్‌తోనే కథను సిద్ధం చేసుకోవడానికి ఇష్టపడతా. ఎప్పుడూ పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకునే సెట్స్‌పైకి వెళ్తా. ఇక ఈ చిత్ర కథ రాసేటప్పుడు ఇందులో ఎవరూ సినిమాటిక్‌గా యాక్ట్‌ చేసినట్లు అనిపించకూడదు అనుకున్నాం. నిజ జీవితంలో ఎలా మాట్లాడుకుంటారో.. సినిమాలోని పాత్రలు అలాగే మాట్లాడుకోవాలి అని నియమం పెట్టుకున్నాం. దానికి తగ్గట్లుగానే కథలో సంభాషణలు అల్లుకున్నాం. వాటికి మంచి ఆదరణ దక్కుతోంది.

తొలి చిత్రం థ్రిల్లర్‌. రెండోది రొమాంటిక్‌ స్టోరీ. అసలు మీకు బాగా ఇష్టమైన జోనరేంటి?

వ్యక్తిగతంగా హారర్‌ తప్ప మిగతా అన్ని జోనర్లు చూడటానికి ఇష్టపడతా. దర్శకుడిగా నేను విభిన్నమైన జోనర్లు చేయాలనుకుంటున్నా. నిజానికి నాకు 'క్షణం' తర్వాత థ్రిల్లర్‌ కథలతో చాలా అవకాశాలొచ్చాయి. దాని వల్ల నాపై ఓ ముద్ర పడిపోతుంది. అందుకే జోనర్‌ మార్చాలనుకొని ప్రేమకథ చేశా. తర్వాత సినిమా మరింత విభిన్నమైన కథాంశంతో చేస్తా. నా నిజ జీవితంలో నేను చూసిన కథలు, వాటి తాలూకూ అనుభవాల సారమే నా చిత్రాల్లో కనిపిస్తుంది.

ఈ చిత్రాన్ని హీరో సిద్ధుతో కలిసి రాశారట కదా. ఈ కథాలోచన ఎవరిది? ఇలాంటి కృష్ణ లీలలు మీ జీవితంలో ఏమైనా జరిగాయా?

కథ నాదే. ఈ సినిమా సిద్ధుతో చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. తనలో మంచి నటుడే కాదు.. చక్కటి మాటల రచయిత ఉన్నాడు. అందుకే తనతో కలిసి పనిచేస్తే బాగుంటుంది అనిపించింది. ఎలాగూ తానే ఈ పాత్రను పోషించబోతున్నాడు కాబట్టి ఏ డైలాగ్‌కు ఎలాంటి ఎక్స్‌ప్రెషనైతే బాగుంటుందని ముందుగానే అనుకొని రాసుకోగలిగాం. అవి సినిమాకు బాగా ఉపయోగపడ్డాయి. అందరి జీవితాల్లో జరిగే కృష్ణ లీలలివి. 'ఒకరినే ప్రేమించాలని రూలేంటి?' అని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదోక దశలో అనుకునే ఉంటారు. నేను చూసిన ప్రపంచంలో చాలా మంది జీవితాల్లోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయి. అందుకే అందరికీ కనెక్ట్‌ అయ్యేలా ఉంటుందని ఈ పాయింట్‌ చుట్టూ కథ అల్లుకున్నాం.

సినిమా బాగా ఆలస్యమైనట్లుంది కారణమేంటి?

ఈ చిత్రాన్ని మేం 50రోజుల్లోనే పూర్తి చేశాం. అక్టోబరు నాటికే పూర్తి కాపీ సిద్ధమైపోయింది. ఎక్కువ థియేటర్లలో విడుదల చేయాలనే ఉద్దేశంతో వేచి చూశాం. మేలో తీసుకొద్దాం అనుకున్నాం. ఈలోపు కరోనా పరిస్థితుల వల్ల మా ప్రణాళికలన్నీ తలకిందులయ్యాయి. దీంతో డిజిటల్‌లో తీసుకొచ్చాం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.