హీరోయిన్ రష్మిక నటించిన తొలి ఆల్బమ్ సాంగ్ 'టాప్ టక్కర్' శుక్రవారం విడుదలైంది. ఆమె అభిమానుల్ని ఈ గీతం అలరిస్తోంది. ఇందులో బాద్షా, యువన్ శంకర్ రాజా, జోనితా గాంధీ కూడా ఉన్నారు. ఈ వీడియోలో కలర్ఫుల్గా ఉన్న సెట్టింగ్లు కళ్లకు ఇంపుగా అనిపించాయి.
ప్రస్తుతం 'పుష్ప' సినిమాలో నటిస్తోంది రష్మిక. అల్లు అర్జున్ ఇందులో హీరోగా చేస్తున్నారు. సుకుమార్ దర్శకుడు. మైత్రీమూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 13న థియేటర్లలో చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
ఇది చదవండి: 'పుష్ప' కోసం రష్మికకు నాలుగు గంటలే నిద్ర