ETV Bharat / sitara

మరో రీమేక్​లో ఆమిర్​!.. అలాంటి పాత్రలో రష్మిక!! - ఆమిర్‌ ఖాన్‌

బాలీవుడ్​ స్టార్​ హీరో ఆమిర్​ ఖాన్ మరో రీమేక్ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇక బ్యూటీ రష్మిక తన కొత్త చిత్రంలో అమాయకురాలి పాత్రలో అలరించనుందని సమాచారం.

aamir khan
rashmika
author img

By

Published : Dec 28, 2021, 9:07 AM IST

'పుష్ప'లో శ్రీవల్లిగా సందడి చేసిన రష్మిక(Rashmika)ని అంత తొందరగా మరిచిపోలేం. చిత్తూరు యాసలో ఆమె మాటలు.. పాత్రలో ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులకు భలే నచ్చింది. భవిష్యత్తులోనూ ఆమె ప్రయాణం ఇంతే వైవిధ్యంగా సాగనున్నట్టు తెలుస్తోంది. తెలుగులో కొత్తగా ఒప్పుకున్న చిత్రంలో ఆమె అమాయకురాలైన ఓ అమ్మాయిగా కనిపిస్తూ వినోదం పంచనున్నట్టు సమాచారం.

rashmika
రష్మిక

హిందీలో వరుసగా సినిమాలు చేస్తున్న రష్మిక తెలుగులో రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ఓ సినిమాకి పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. ఇందులో రష్మిక తన నటనలో మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ అమాయకురాలైన ఓ యువతిగా కనిపించనున్నట్టు తెలిసింది. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశాలున్నాయి.

మరో రీమేక్‌ కథతో ఆమిర్‌?

బాలీవుడ్‌ కథా నాయకుడు ఆమిర్‌ ఖాన్‌ ప్రస్తుతం 'లాల్‌ సింగ్‌ చద్దా' చిత్రంతో బిజీగా ఉన్నారు. హాలీవుడ్‌లో విజయవంతమైన 'ఫారెస్ట్‌ గంప్‌' సినిమాకి రీమేక్‌గా రూపొందుతోంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా తర్వాత ఆమీర్‌ చేయబోయే చిత్రమేంటన్నది ఇంత వరకు అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం బాలీవుడ్‌ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఆయన మరో రీమేక్‌ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది.

aamir khan
ఆమిర్‌ ఖాన్‌

విజయవంతమైన స్పానిష్‌ సినిమా 'కాంపియోన్స్‌'ను ఆమిర్‌ హిందీలో చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి ఆర్‌.ఎస్‌.ప్రసన్న దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయని.. వచ్చే ఏడాది సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని ప్రచారం వినిపిస్తోంది. అలాగే గుల్షన్‌ కుమార్‌ జీవిత కథలోనూ ఆమిర్‌ నటించనున్నట్లు బాలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తోంది.

ఇదీ చూడండి: పెళ్లి తర్వాతే నాకు ఎక్కువ ఛాన్సులు: హీరోయిన్ ఆకాంక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.