పాన్ ఇండియా గుర్తింపుని సొంతం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది బ్యూటీక్వీన్ రష్మిక. ఇప్పటికే దక్షిణాదిలో ఆమె అగ్రనాయికగా కొనసాగుతోంది. ఇప్పుడు హిందీలోకీ అడుగు పెట్టిందీ ముద్దుగుమ్మ.
'మిషన్ మజ్ను' పేరుతో రూపొందుతున్న సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటిస్తోంది. ఆ సినిమా చిత్రీకరణ శుక్రవారమే మొదలైంది. కథానాయకుడితో కలిసి బైక్‌పై దూసుకెళుతున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేశాయి. దీంతో పాటు బిగ్‌బీ అమితాబ్తోనూ ఓ చిత్రం చేయనుంది రష్మిక.
![Rashmika busy with back to back movies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10173586_yv.jpg)
తెలుగులోనూ ఆమె వరుసగా సినిమాలకు పచ్చజెండా ఊపుతోంది. ఇప్పటికే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' కోసం రంగంలోకి దిగిన రష్మిక, తదుపరి శర్వానంద్‌తో కలిసి ఓ సినిమాలో నటించబోతోంది. తమిళంలోనూ అరంగేట్రం చేస్తోందీ బ్యూటీ. కార్తీ నటిస్తున్న 'సుల్తాన్' చిత్రంలో మెరవనుంది.
![Rashmika busy with back to back movies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10173586_yv2.jpg)
అన్నీ కుదిరితే ఆమె నాగచైతన్యతోనూ కలిసి వరుసగా రెండు సినిమాలు చేసే అవకాశాలున్నాయి. నాగచైతన్య 'థ్యాంక్యూ'లో ముగ్గురు నాయికలకి చోటుంది. అందులో ఓ నాయికగా రష్మికని ఎంపిక చేసుకునే ప్రయత్నాల్లో చిత్రబృందం ఉన్నట్టు సమాచారం. అలాగే చైతన్యతోనే మోహనకృష్ణ ఇంద్రగంటి ఓ చిత్రం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అందులో నాయికగా రష్మికని ఎంపిక చేసుకోవాలని ముందుగానే నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఇదీ చూడండి: 'ఇష్క్' తెలుగులో మరోసారి.. పాటతో వచ్చిన అల్లుడు