ETV Bharat / sitara

'నేను తొలిసారి చూసిన స్టార్స్‌ వాళ్లే' - రష్మిక సినిమాలు

తన అందంతో కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టిన ముద్దుగుమ్మ రష్మిక. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఇటీవలే 'భీష్మ'తో మంచి విజయం అందుకున్న ఈ నటి తాను తొలిసారిగా చూసిన స్టార్స్ వీళ్లే అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

'నేను తొలిసారి చూసిన స్టార్స్‌ వాళ్లే'
'నేను తొలిసారి చూసిన స్టార్స్‌ వాళ్లే'
author img

By

Published : Aug 28, 2020, 8:11 AM IST

తన అందంతో కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టిన ముద్దుగుమ్మ రష్మిక. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఇటీవలే 'భీష్మ'తో మంచి విజయం అందుకున్న ఈ నటి తాను తొలిసారిగా చూసిన స్టార్స్ వీళ్లే అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

"ఓ స్టార్‌ ఎలా ఉంటారు? వాళ్ల జీవితం ఎలా సాగుతుంది? ఏం తింటారు? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలని ఉండేది. పేపర్లు, టీవీల్లో నా అభిమాన తారల సంగతులు వచ్చినప్పుడు ఆసక్తిగా చదివేదాన్ని. షూటింగ్‌లు చూడాలని ఉండేది కానీ, ఎప్పుడూ ఛాన్స్‌ దొరకలేదు. అయితే సినిమాల్లోకి అడుగుపెట్టాక బయట జీవితం వేరు, సినిమాలు వేరు అని అర్థమైంది. చిత్రసీమలోకి వచ్చిన కొత్తలో చిత్రీకరణ వివరాలు, నేను పనిచేసిన హీరోలకు సంబంధించిన కబుర్లను నా స్నేహితులు అడిగేవారు. కొత్త కాబట్టి నేనూ ఏవేవో చెప్పేదాన్ని. ఇక తర్వాత నుంచి అంతా మామూలైపోయింది. అన్నట్లు నేను తొలిసారి చూసిన స్టార్స్‌ ఎవరో తెలుసా.. ఉపేంద్ర, కృతి కర్బంద. బెంగళూరులో చదువుకునే రోజుల్లో 'ఫ్రెష్‌ ఫేస్‌' అనే కాంపిటీషన్‌లో వాళ్లని చూశా. తర్వాత ముంబయికి వెళ్లినప్పుడు అక్షయ్‌ కుమార్‌, రానాలను చూశా" అని రష్మిక తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.