అందం, అభినయం కలగలిసిన నటి రాశీ ఖన్నా(Rashi Khanna). కాస్త బొద్దుగా, ముద్దుగా కనిపించి తొలి పరిచయంలోనే తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఆ తర్వాత సన్నజాజిలా మారి, గ్లామర్ డోస్ పెంచింది. 'మద్రాస్ కేఫ్'(Madras Cafe) అనే హిందీ చిత్రంతో నటిగా మారిన రాశీ 2014లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్గా ఆమె నటించిన తొలి తెలుగు సినిమా 'ఊహలు గుసగుసలాడే' విడుదలై నేటికి ఏడేళ్లు. ఈ సందర్భంగా తన సినీ కెరీర్‌పై ఓ లుక్కేద్దాం..
![Rashi Khanna completed 7 years in Cine Industry](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12205389_6.jpg)
2014..
అక్కినేని కుటుంబం నటించిన 'మనం' చిత్రంతో తొలిసారి తెలుగు తెరపై కనిపించింది రాశీ. అయితే ఇందులో ప్రేమ అనే చిన్న పాత్రకే పరితమైంది. అవసరాల శ్రీనివాస్, నాగశౌర్య కథానాయకులుగా తెరకెక్కిన 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో నాయికగా కెరీర్ ప్రారంభించింది. శ్రీ సాయి శిరీషా ప్రభావతి.. ఇంత పెద్ద పేరేంటో అంటూ ఆమె పలికిన హావభావాలు ఎప్పటికీ మరిచిపోలేం. అదే ఏడాది సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన 'జోరు' చిత్రంలో అవకాశం అందుకుంది. ఈ సినిమాలో ఓ పాటనీ ఆలపించి, గాయనిగా మంచి మార్కులే కొట్టేసింది.
![Rashi Khanna completed 7 years in Cine Industry](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12205389_7.jpg)
2015..
2015లో ఆమె నటించిన మూడు చిత్రాలు విడుదలయ్యాయి. అవే.. గోపీచంద్ హీరోగా వచ్చిన 'జిల్', రామ్ 'శివమ్', రవితేజ 'బెంగాల్ టైగర్'. వీటిల్లో 'జిల్'లో పోషించిన సావిత్రి పాత్ర ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
![Rashi Khanna completed 7 years in Cine Industry](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12205389_5.jpg)
2016..
2016లో సాయి తేజ్ కథానాయకుడిగా తెరకెక్కిన 'సుప్రీమ్' చిత్రంలో బెల్లం శ్రీదేవిగా కనిపించి విశేషంగా ఆకట్టుకుంది. 'హైపర్' సినిమాలో భానుమతిగా రామ్ సరసన మరోసారి కనువిందు చేసింది.
2017..
ఎన్టీఆర్ సరసన 'జై లవకుశ'లో ప్రియ, గోపీచంద్ సరసన 'ఆక్సిజన్'లో శ్రుతి పాత్రల్లో కనిపించింది.
![Rashi Khanna completed 7 years in Cine Industry](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12205389_4.jpg)
2018..
'బెంగాల్ టైగర్' తర్వాత 'టచ్ చేసి చూడు' సినిమా కోసం మరోసారి రవితేజతో జోడీ కట్టింది రాశీ. ఇందులో పుష్పగా నటించింది. వరుణ్ తేజ్‌తో కలిసి నటించిన ప్రేమకథా చిత్రం 'తొలిప్రేమ'. ఈ చిత్రంలో వర్ష అనే పాత్రలో దర్శనమచ్చి యువతను తనవైపు తిప్పుకుంది. నితిన్ సరసన 'శ్రీనివాస కల్యాణం'లో శ్రీ అనే పాత్రలో ఒదిగిపోయి కుటుంబ కథా ప్రేక్షకుల్ని అలరించింది.
2019..
వెంకటేశ్, నాగచైతన్యల మల్టీస్టారర్ 'వెంకీమామ'లో చైతూకి జోడీగా సందడి చేసిన రాశీ, అదే ఏడాది సాయి తేజ్ హీరోగా తెరకెక్కిన 'ప్రతిరోజూ పండగే' చిత్రంలో ఏంజెల్ ఆర్నగా కనిపించింది. టిక్‌టాక్ వీడియోలు చేసే అమ్మాయిగా ఎంత వినోదం పంచిందో ప్రత్యేక చెప్పనవసరం లేదు.
![Rashi Khanna completed 7 years in Cine Industry](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12205389_2.jpg)
2020..
విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన లవ్‌స్టోరీ 'వరల్డ్ ఫేమస్ లవర్'లో యామిని అనే పాత్రలో ఒదిగిపోయింది.
2021..
ప్రస్తుతం నాగచైతన్య సరసన 'థ్యాంక్ యూ' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకు విక్రమ్ కె. కుమార్ దర్శకుడు. దీంతోపాటు గోపీచంద్ సరసన 'పక్కా కమర్షియల్'తో మరోసారి సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరోవైపు రాజ్&డీకే దర్శకత్వంలో షాహిద్ కపూర్‌తో కలిసి ఓ వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తోంది.
ఇదీ చూడండి.. రాశీఖన్నా డిజిటల్ ఎంట్రీ.. సైకో హంతకురాలిగా!