ETV Bharat / sitara

రానా: దగ్గుబాటి వారసుడు.. ఆజానుబాహుడు

author img

By

Published : Dec 14, 2019, 5:36 AM IST

Updated : Dec 14, 2019, 7:16 AM IST

రానా దగ్గుపాటి.. ఈ పేరు వింటే బాహుబలిలో భళ్లాలదేవ గుర్తుకువస్తాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా, నిర్మాతగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎన్నో పాత్రల్లో ప్రేక్షకులను అలరించిన ఈ హీరో పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.

rana
రానా

టాలీవుడ్ ఆజానుబాహుడు.. దగ్గుపాటి వారసుడు.. రానా పుట్టినరోజు నేడు. డిసెంబర్ 14, 1984న జన్మించాడు రానా. లీడర్ లాంటి సామాజిక ఇతివృత్తమున్న సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు.. తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా నిలబడేందుకు ప్రయత్నిస్తున్నాడు.

కెరీర్ ప్రారంభంలో ఆచితూచి అడుగులేసిన రానా.. బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో భళ్లాలదేవ లాంటి క్రూరమైన విలన్ పాత్రలో ఒదిగిపోయాడు. రుద్రమదేవి లాంటి సినిమాతో మంచి ఇమేజ్ సంపాందించాడు. ఘాజీ, నేనే రాజు నేనేమంత్రి చిత్రాలతో స్టార్​గా మారిపోయాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఓ వైపు తెలుగులో వరుస సినిమాలు చేస్తూనే.. మరోవైపు హిందీలోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు రానా. దమ్ మారో దమ్​తో బాలీవుడ్​కి వెళ్లిన ఈ హీరో.. తర్వాత డిపార్ట్​మెంట్, బేబీలాంటి సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్నాడు. తమిళనాట రానాకు మంచి గుర్తింపు ఉంది. అజిత్ ఆరంభం సినిమాలో కీలకపాత్రలో నటించాడు. ఇలా అన్ని ఇండస్ట్రీల్లోనూ రానాకు స్టార్ ఇమేజ్ ఉంది.

డిజిటల్ తెరపై

ఓ డిజిటల్ మాధ్యమం ప్రసారం చేస్తోన్న నెంబర్ వన్ యారీ ప్రోగ్రామ్​కు రానా యాంకర్​గా వ్యవహరించాడు. ఈ షోతో మంచి పేరు తెచ్చుకున్నాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

నిర్మాతగా

బొమ్మలాట, కేరాఫ్ కంచరపాలెం చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు రానా. ఇందులో బొమ్మలాట మూవీ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ తెలుగు కేటగిరీలో జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.

విజువల్ ఎఫెక్ట్స్ కో ఆర్డినేటర్​గా

మహేశ్ బాబు హీరోగా నటించిన సైనికుడు చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ కో ఆర్డినేటర్​గా పని చేశాడీ దగ్గుపాటి హీరో. ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో నంది అవార్డు వచ్చింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

డబ్బింగ్ ఆర్టిస్ట్​గా

హాలీవుడ్​ నుంచి టాలీవుడ్​ వరకు ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న చిత్రం అవెంజర్స్. ఇందులోని అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్, ఎండ్​గేమ్ సిరీస్​ల్లో థానోస్ పాత్రకు రానా గొంతు అరువిచ్చాడు.

అనారోగ్య కారణాల వల్ల కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు రానా. ఇటీవలే కోలుకుని మళ్లీ షూటింగ్​లపై దృష్టిపెట్టాడు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో విరాట పర్వంతో పాటు పలు సినిమాలు ఉన్నాయి.

ఇవీ చూడండి.. 'సరిలేరు నీకెవ్వరు' సెట్​లో గంగవ్వ సందడి

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
COP25 HB POOL TVE - AP CLIENTS ONLY
Madrid – 13 December 2019
1. COP25 President Carolina Schmidt and officials arriving at podium
2. SOUNDBITE (English) Carolina Schmidt, COP25 President:
"We are reaching the final hours of the process of the COP (Conference of the Parties), and now, now is the time we must show the world that we are capable to get to consensus and agreements that are needed to tackle the crisis that we are facing all over the world."
3. Participants in plenary
4. SOUNDBITE (English) Carolina Schmidt, COP25 President:
"Some issues have progressed more than others, but there was a general optimism that landing zones were beginning to emerge."
5. Plenary with delegations, among them Brazil
6. Podium
STORYLINE:
Officials from almost 200 countries scrambled Friday to reach an agreement at a UN climate meeting in Madrid amid growing concerns that key issues may be postponed for another year.
With the prospect of overtime looming, negotiators split their work into two parts, separating discussions on aid for poor countries affected by climate change from those over a deal on international carbon markets.
"We are reaching the final hours of the process," said Chile's Environment Minister Carolina Schmidt, who is chairing the talks.
"Now is the time we must show the world that we are capable to get to consensus and agreement that are needed to tackle the crisis that we are facing all over the world," Schmidt said.
"Some issues have progressed more than others, but there was a general optimism that landing zones were beginning to emerge," she added.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 14, 2019, 7:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.