భళ్లాలదేవుడు రానా.. తెలుగులో ప్రస్తుతం 'విరాటపర్వం' సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను కేరళలోని మలయత్తూర్లో తీస్తున్నారు. ఇతడితో పాటు కథానాయిక సాయిపల్లవి షూటింగ్లో పాల్గొంది. త్వరలో విడుదల తేదీపై చిత్రబృందం స్పష్టతనివ్వనుంది.

1992లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. ఇందులో సాయిపల్లవి నక్సలైట్‌గా, రానా పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. వీరితో పాటే టబు, ప్రియమణి, నందితా దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. సురేశ్‌బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
