మెగా పవర్‌స్టార్ రాంచరణ్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నాడు. చిన్నప్పుడు చదువుకున్న తమిళనాడు లవ్‌డేల్‌లోని లారెన్స్ పాఠశాలకు వెళ్లి అక్కడ కాసేపు గడిపాడు. ఈ ఫొటోలను చరణ్ సతీమణి ఉపాసన సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.

ప్రస్తుతం చరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్లో నటిస్తున్నాడు చరణ్. జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా ఈ మెగాహీరోకు గాయమైన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని తెలియజేస్తూ ఆర్ఆర్ఆర్ టీం ఓ ట్వీట్ కూడా చేసింది. చరణ్ గాయం కారణంగా అతడి సన్నివేశాల చిత్రీకరణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న చరణ్ తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నాడు. పాఠశాల పిల్లలతో కాసేపు సరదాగా గడిపాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇవీ చూడండి.. 'దొరికావంటే నీ లైఫే బ్యాంగ్ బ్యాంగ్'