హీరో నవీన్ పోలిశెట్టిపై నటుడు రాహుల్ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నవీన్‌కు వార్నింగ్ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. నవీన్, రాహుల్, ప్రియదర్శి ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'జాతిరత్నాలు'. ప్రస్తుతం ఈ సినిమా విజయోత్సవ వేడుకల్లో చిత్రబృందం హుషారుగా పాల్గొంటోంది. ఇందులో భాగంగానే నవీన్, ప్రియదర్శి ఇటీవలే అమెరికా వెళ్లారు. న్యూజెర్సీలో జరిగిన సక్సెస్‌టూర్‌కు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ స్వప్నా సినిమాస్ అభిమానులతో పంచుకుంది. అయితే, ఆ వీడియో చూసిన రాహుల్.. తనను తీసుకువెళ్లకుండా నవీన్, ప్రియదర్శి యూఎస్ వెళ్లడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓ సరదా వీడియోను విడుదల చేశారు.
-
Scandalous video response to #JathiRatnalu team’s USA success tour by @eyrahul @NaveenPolishety @priyadarshi_i https://t.co/vZpJocELTI pic.twitter.com/67Upo8Gl1m
— Rahul Ramakrishna (@eyrahul) March 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Scandalous video response to #JathiRatnalu team’s USA success tour by @eyrahul @NaveenPolishety @priyadarshi_i https://t.co/vZpJocELTI pic.twitter.com/67Upo8Gl1m
— Rahul Ramakrishna (@eyrahul) March 20, 2021Scandalous video response to #JathiRatnalu team’s USA success tour by @eyrahul @NaveenPolishety @priyadarshi_i https://t.co/vZpJocELTI pic.twitter.com/67Upo8Gl1m
— Rahul Ramakrishna (@eyrahul) March 20, 2021
"అరేయ్ దర్శి, నవీన్.. పీపుల్స్ ప్లాజాలో సక్సెస్‌మీట్ అయ్యాక.. మిమ్మల్ని కలిసేలోపే పాస్‌పోర్ట్‌తో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి.. విమానమెక్కి యూఎస్ వెళ్లిపోతారేరా.! నేను చెప్పా కదరా.. నా దగ్గర కూడా పాన్ కార్డ్ ఉందని. పాన్‌కార్డు చూపిస్తే అక్కడ ఎంట్రీ ఇస్తార్రా..! జోగిపేట రవిరా నేను. నా వల్లే ప్రాబ్లమ్ అవుతుందని నన్ను వదిలేసి వెళ్లిపోయారు కదరా! మీరు రండ్రా మీ సంగతి చెబుతా..!" అంటూ రాహుల్ ఓ సరదా వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జాతిరత్నాలు’కు అనుదీప్ దర్శకత్వం వహించారు. ఫరియా అబ్దుల్లా కథానాయిక. వైజయంతి మూవీస్, స్వప్నా సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. నాగ్ అశ్విన్ నిర్మాత. మార్చి 11న విడుదలైన ఈ సినిమా బాక్ల్‌బస్టర్ విజయాన్ని అందుకుంది.
ఇదీ చూడండి: 'వకీల్‌సాబ్'లో పవన్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్!