ETV Bharat / sitara

హీరోయిన్ 'ఫస్ట్​నైట్' కామెంట్స్.. బ్యాన్​ చేయాలని డిమాండ్

ప్రముఖ కథానాయిక రచితారామ్​.. ఇటీవల 'ఫస్ట్​నైట్'పై చేసిన కామెంట్స్ వివాదాస్పదమవుతున్నాయి. ఆమెను బ్యాన్ చేయాలని కన్నడ క్రాంతి దళ్ డిమాండ్ చేసింది.

Rachita Ram 'first night' comment
హీరోయిన్ రచితారామ్
author img

By

Published : Nov 15, 2021, 3:49 PM IST

Updated : Nov 15, 2021, 4:06 PM IST

హీరోయిన్ రచితారామ్ చేసిన 'ఫస్ట్​నైట్​' కామెంట్స్ రచ్చ రచ్చ అవుతున్నాయి! ఆమె నిషేధించాలంటూ పలు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తన సినిమాలో బోల్డ్​ సన్నివేశాల గురించి ఆమె వ్యాఖ్యలు దూమారం రేపుతున్నాయి.

ఇంతకీ ఏం జరిగింది?

తాను హీరోయిన్​గా నటించిన 'లవ్​ యూ రాచు' ప్రచారంలో భాగంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సినిమాలోని పలు సన్నివేశాలను ప్రదర్శించారు. అందులో కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి. దీనిపై ఓ జర్నలిస్ట్.. 'సినిమాలో బోల్డ్​ సన్నివేశాలు చేయడంపై మీ అభిప్రాయం ఏంటి' అని హీరోయిన్​ రచితను అడిగారు.

.
.

దీనిపై స్పందించిన ఆమె.. ''ఇక్కడ పెళ్లయిన వారు చాలామంది ఉన్నారు. ఎవరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సాధారణంగా పెళ్లి తర్వాత ఏం చేస్తారో చెప్పండి" అని అడిగింది. జర్నలిస్ట్ తిరిగి సమాధానం చెప్పేలోపే.. 'రొమాన్స్ చేస్తారు. నిజమే కదా? ఇందులో అదే చూపించాం' అని తన వ్యాఖ్యలను సమర్ధిస్తూ సమాధానమిచ్చింది.

'రచితను నిషేధించాలి'

రచిత కామెంట్స్​పై కన్నడ క్రాంతి దళ్ అధ్యక్షుడు తేజస్వి నాగలింగస్వామి మండిపడ్డారు. ఆమెను నిషేధించాలంటూ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్​కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఎక్కడా 'లవ్ యూ రాచు' సినిమా ప్రదర్శించకుండా, విడుదలను అడ్డుకుంటామని అన్నారు. దీంతో తమ సంప్రదాయలకు ఈ వ్యాఖ్యలు విరుద్ధంగా ఉన్నాయని, ఆమె క్షమాపణలు చెప్పాలని ఫిల్మ్ ఛాంబర్​ ఆదేశించింది.

.
.

రచిత తెలుగు సినిమా

కన్నడలో స్టార్​ హీరోలతో కలిసి గత కొన్నేళ్లుగా సినిమాలు చేస్తున్న ఈమె.. తెలుగులోనూ 'సూపర్​మచ్చి' సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇస్తోంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్​దేవ్ హీరోగా నటిస్తున్నారు. పులివాసు దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.

ఇవీ చదవండి:

Last Updated : Nov 15, 2021, 4:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.