టాలీవుడ్ డాషింగ్ దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోయిన్ ఛార్మీ గొప్ప మనసు చాటుకున్నారు. కేవలం ఒకటో, రెండో చిత్రాలు తీసి వివిధ కారణాల వల్ల సినిమాలు చేయలేకపోతున్న దర్శకులు, అసిస్టెంట్ దర్శకులకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తున్నట్లు తెలిపారు.
'ఇస్మార్ట్ శంకర్' విజయంతో జోరుమీదున్న పూరీ తన పుట్టిన రోజు కానుకగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు పూరీ కనెక్ట్స్ లెటర్ ప్యాడ్‌పై ఓ నోట్ రాసి విడుదల చేశాడు. "మా ఈ చిన్న సహాయం.. మీకు ఏమాత్రం ఊరటనిచ్చినా చాలు.. అది మా ప్రయాణానికి ఆశీస్సులుగా భావిస్తాం. మేము తలపెట్టే ఇలాంటి కార్యక్రమానికి మీ అందరిని ఆహ్వానిస్తున్నాం.." అంటూ రాసుకొచ్చాడు.
హీరోయిన్గా పలు చిత్రాల్లో అలరించిన ఛార్మీ.. ఆ తర్వాత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. పూరీ జగన్నాథ్‌తో కలిసి 'పూరీ కనెక్ట్స్' పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించి వరుస సినిమాలు నిర్మిస్తోంది.
ఒకప్పుడు టాలీవుడ్‌కు బ్లాక్బాస్టర్ సినిమాలు అందించిన పూరీ.. కొంతకాలం వరుస ఫ్లాప్‌లతో సతమతమయ్యాడు. ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయం అందుకున్నాడు. పూరీ కనెక్ట్స్, పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్త సమర్పణలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది.
ఇవీ చూడండి.. కృష్ణ జింక వేట కేసు విచారణకు సల్మాన్ గైర్హాజరు