మెగాస్టార్ చిరంజీవి మొదటి సినిమా 'పునాదిరాళ్లు'కు దర్శకత్వం వహించిన గుడిపాటి రాజ్‌కుమార్ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం ఉదయం ఆయన మరణించారు.
రాజ్‌కుమార్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న చిరంజీవి.. ఇటీవల ఆయనకు అపోలో ఆసుపత్రిలో వైద్యం చేయించాడు. కొన్ని రోజుల క్రితమే రాజ్‌కుమార్ పెద్ద కుమారుడు, ఆ తర్వాత భార్య మృతి చెందడం వల్ల రాజ్‌కుమార్ మరింత కుంగిపోయారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా ఉయ్యూరుకు భౌతికకాయాన్ని తరలించేందుకు చిన్న కుమారుడు ఏర్పాట్లు చేస్తున్నాడు.
'పునాదిరాళ్లు' సినిమా.. చిరంజీవి, దర్శకుడు రాజ్‌కుమార్‌లకు మొదటి సినిమా. ఈ చిత్రానికి ఐదు నంది అవార్డులు దక్కాయి.
ఇదీ చూడండి.. 'లవ్‌స్టోరి' దర్శకుడికి నాగచైతన్య కూల్ గిఫ్ట్