ప్రముఖ సినీ నిర్మాత దిల్‌రాజు.. తన సతీమణితో కలిసి ఆదిలాబాద్‌కు వచ్చారు. జిల్లా కేంద్రంలో ఉన్న బాల్య స్నేహితులను కలుసుకునేందుకు ఆయన వచ్చారు. వారితో కొద్దిసేపు ముచ్చటించారు.
దిల్‌రాజు రాక గురించి తెలుసుకున్న అభిమానులు.. ఆయన తిరిగి వెళ్లిపోయేటప్పుడు స్వీయచిత్రాలు తీసుకునేందుకు ఆసక్తి కనబర్చారు. దిల్‌రాజు కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా అభిమానులతో భౌతిక దూరం పాటిస్తూనే వారి కోరిక నెరవేర్చారు.