ETV Bharat / sitara

టాలీవుడ్​లో రీమేక్​ల హవా.. వాళ్లు మళ్లీ చూస్తారా?

వచ్చే ఏడాది, టాలీవుడ్​ ప్రేక్షకుల్ని పలు రీమేక్​లు పలకరించనున్నాయి. ఓటీటీల వల్ల వాటి ఒరిజినల్​ సినిమాల్ని మనవాళ్లు ఇప్పటికే చూసేస్తున్నారు. దీంతో రాబోయే రీమేక్​ల్ని మళ్లీ చూస్తారో? లేదో?

present remakes in tollywood
టాలీవుడ్​లో రీమేక్​ల హవా.. వాళ్లు మళ్లీ చూస్తారా?
author img

By

Published : Dec 29, 2020, 9:00 AM IST

హిట్ సినిమాలను రీమేక్​ చేయడం కత్తిమీద సాము. ప్రేక్షకులకు అది నచ్చాలంటే ఒరిజినల్​కు ఏ మాత్రం తగ్గకుండా తీయాలి. లేదంటే మొదటికే మోసం వచ్చేస్తుంది. కానీ కొందరు మాత్రం రీమేక్​ల వైపే ఎక్కువగా మొగ్గుచూపిస్తారు. అయితే ఇలా రీమేక్​లు తెరకెక్కించడం సేఫ్ గేమ్ అని కొందరి అభిప్రాయం.

dhanush venkatesh
ధనుష్ - వెంకటేశ్

ఎందుకంటే ఒక్కసారి ఆకట్టుకున్న కథను కొద్దిపాటి మార్పులు చేసి తీస్తే సరిపోతుంది. అయితే ఈ మధ్య కాలంలో టాలీవుడ్​లో రీమేక్​ల జోరు బాగా పెరిగింది. అగ్రహీరోలు చిరంజీవి, పవన్​ కల్యాణ్, వెంకటేశ్ ప్రస్తుతం వాటి చిత్రీకరణలతో బిజీగా ఉన్నారు. లాక్​డౌన్​ వల్ల దాదాపు ఎనిమిది నెలలు థియేటర్లు తెరుచుకోలేదు, లేదంటే ఈ పాటికే చాలా రీమేక్​లు అభిమానుల ముందుకు వచ్చేవి. టాలీవుడ్​లో ఇప్పుడు తెరకెక్కుతున్న రీమేక్​లు ఏవి? వాటిలో ఎవరెవరు నటిస్తున్నారు? అనే విషయాల సమాహారమే ఈ కథనం.

రీమేక్స్​లో మెగా బ్రదర్స్ దూకుడు

మెగా సోదరులు చిరంజీవి, పవన్​కల్యాణ్.. చెరో రెండు రీమేక్​లు ఒప్పుకుని దూకుడు చూపిస్తున్నారు. 'లూసిఫర్', 'వేదాళం' షూటింగ్​లు వచ్చే ఏడాది ప్రధమార్థంలో ప్రారంభం కానున్నాయి. వీటిలో చిరు కథానాయకుడిగా నటిస్తారు. పవన్​ నటిస్తున్న 'పింక్​' రీమేక్​ 'వకీల్​సాబ్'షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్​లో రానాతో కలిసి తెరను పంచుకోనున్నారు పవర్​స్టార్. వీటిపై అభిమానుల్లో అంచనాలు అప్పుడే పెరిగిపోవడం విశేషం.

chiru pawan kalyan ram
చిరు - పవన్ కల్యాణ్ - రామ్

కొన్ని చిత్రీకరణల్లో.. కొన్ని విడుదలకు సిద్ధంగా

విక్టరీ వెంకటేశ్ 'నారప్ప'.. తమిళ హిట్​ 'అసురన్'కు రీమేక్. వెంకీ పుట్టినరోజున వచ్చిన గ్లింప్స్​తో అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇందులో వెంకీ పేద రైతుగా, ఇద్దరు పిల్లల తండ్రిగా కనిపించనున్నారు.

రామ్ 'రెడ్'.. తమిళ సినిమా 'తడమ్'కు రీమేక్. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. సుమంత్ 'కపటధారి'.. కన్నడ థ్రిల్లర్ 'కవలుదారి' ఆధారంగా తెరకెక్కించారు.

మలయాళ హిట్ 'హెలెన్​' రీమేక్​లో అనుపమ.. కోలీవుడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్​టైనర్ 'ఓ మై కడవులే' రీమేక్​లో విశ్వక్​సేన్.. ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. 'కప్పెలా' హక్కుల్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, 'డ్రైవింగ్ లైసెన్స్' హక్కుల్ని కొణిదెల ప్రొడక్షన్స్ సొంతం చేసుకున్నాయి. త్వరలో వీటి షూటింగ్స్ మొదలు కానున్నాయి.

vedalam remake chiranjeevi
వేదాళం రీమేక్​లో హీరోగా చిరు

మళ్లీ చూస్తారా?

లాక్​డౌన్​ వల్ల చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు. దీంతో పైన చెప్పిన రీమేక్స్​ ఒరిజినల్​ చిత్రాల్ని దాదాపుగా చూసేశారు. అయితే వాటి తెలుగు రీమేక్స్ త్వరలో మన​ థియేటర్లలో విడుదలైతే.. మన వాళ్లు మళ్లీ చూస్తారా? అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.