తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నూతన ఛైర్మన్‌గా మరోసారి ప్రతాని రామకృష్ణగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సుమారు 10 వేల మంది సభ్యులున్న ఈ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గాన్ని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. నాలుగోసారి ఎన్నిక కావడంపట్ల రామకృష్ణగౌడ్ హర్షం వ్యక్తం చేశారు. వచ్చే రెండేళ్లపాటు అసోసియేషన్‌లోని ప్రతి సభ్యుడి సంక్షేమం కోసం తనవంతు కృషి చేస్తానని రామకృష్ణగౌడ్ తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్‌లో ఉన్న సభ్యుల్లో చాలా మందికి ఇప్పటికీ ఇల్లు లేవని... వారందరికి ఇల్లు వచ్చేవిధంగా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎఫ్‌ఎన్‌సీసీలో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ నూతన కార్యవర్గ పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రామకృష్ణగౌడ్... త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుస్తానని అన్నారు. సభ్యుల సంక్షేమ కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తానని తెలిపారు.
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌లోని అన్ని శాఖలను కలుపుతే 10 వేల మంది సభ్యులు ఉంటారు. వీరందరు కలసి ఏకగ్రీవంగా నూతన కార్యవర్గాన్ని ఆమోదించడం పట్ల ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వచ్చే రెండేళ్లపాటు అసోసియేషన్‌లోని ప్రతి సభ్యుడి సంక్షేమం కోసం తనవంతు కృషి చేస్తాను. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌లో ఉన్న సభ్యుల్లో చాలా మందికి ఇల్లు లేవు. వారందరికీ ఇల్లు వచ్చేవిధంగా ప్రయత్నిస్తాను. నూతన కార్యవర్గంతో కలసి త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలసి.. సభ్యుల సంక్షేమ కోసం కృషి చేస్తాను.- ప్రతాని రామకృష్ణగౌడ్ , తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఛైర్మన్
ఇదీ చదవండి: ADDITIONAL COLLECTOR: బుల్లెట్ బండి పాటకు స్టెప్పులతో అదరగొట్టిన అదనపు కలెక్టర్